మీ ప్రాంతంలో తాగు నీటి కొరత ఉందా ? అయితే `జలవాణి`కి కాల్ చేయండి
ఎండాకాలం దృష్యా తాగు నీటి సమస్య లేకుండా చేసేందుకు ఏపీ సర్కార్ సరికొత్త విధానాన్ని అమలు చేస్తోంది.
రాష్ట్రంలో తాగునీటి కొరత లేకుండా చేయాలనే లక్ష్యంతో ఏపీ సర్కార్ సరికొత్త విధానాన్ని రూపొందించింది. జలవాణి పేరుతో టీం ఏర్పాటు చేసింది. వీరిని సంప్రదించేందుకు ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. మీ ప్రాంతంలో తాగునీటి సమస్యలు ఉంటే జలవాణి టోల్ ఫ్రీ నంబర్ 18004251899 కు కాల్ చేయండి...వెంటనే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందంటున్నారు అధికారులు.
ఈ అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ తాగు నీటి సమస్యలపై జలవాణికి 3,813 ఫిర్యాదులు వచ్చాయనీ... వాటిలో 80.51 శాతం ఫిర్యాదులను పరిష్కరించామని పేర్కొన్నారు. తాగు నీటి కొరత ఉన్న చోట్ల ట్రాన్స్ పోర్టేషన్ విధానం ద్వారా రోజులకు 15,000 ట్రిప్పుల చొప్పున 3,494 నివాస ప్రాంతాలకు తాగునీటిని అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. అలాగే 469 ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకుని నీటి కొరత లేకుండా చేస్తున్నామని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి ట్విట్టర్ లో స్పందించారు.
>