లోక్ సభలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో  టీడీపీ, వైసీపీలు ఈ రోజు  ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగని విషయం తెలిసిందే. అవిశ్వాసంపై చర్చకు సిద్ధమైన సమయంలో టీఆర్ఎస్, అన్నాడీఎంకే పార్టీలు వేరే అంశాలు లేవనెత్తి ఆందోళన చేపట్టడంతో దీని పై చర్చ జరగకుండానే ముగిసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కావేరీ రివర్ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే పట్టుబట్టగా.. రిజర్వేషన్ల అంశంపై చర్చ కోరుతూ  టీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ వెల్ లోకి వెళ్లి ప్లకార్డులు ప్రదర్శించి సభను స్తంభింప జేశారు. ఈ నేపథ్యంలో అవిశ్వాసంపై చర్చ జరగకుండానే స్పీకర్ సభను వాయిదా వేయాల్సి వచ్చింది. 


తాజా పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు వస్తున్నాయి. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండా ఉండేందుకే అన్నాడీఎంకేతో కలిసి తెలంగాణ సీఎం  కేసీఆర్ ఇలా వ్యహరచన చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


వాస్తవానికి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం టీఆర్ఎస్, అన్నాడీఎంకే పార్టీలకు ఏమాత్రం ఇష్టలేదని విషయం బహిరంగ రహస్యమే. అయితే ఆ పార్టీలు ఇప్పటి వరకు దీన్ని బహిరంగంగా వ్యతిరేకించనప్పటికీ.. అంతర్గతంగా దీన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. కేంద్రంపై అవిశ్వాసం పెట్టేందుకు ఎన్డీయేతర జాతీయ పార్టీలన్నీ ఏకతాటిపై వచ్చినప్పటికీ పొరుగు రాష్ట్రాలకు చెందిన టీఆర్ఎస్, అన్నాడీఎంకే పార్టీలు ముందుకు రాకపోవడం వంటి పరిణామాలు ఈ విమర్శలకు బలానిస్తున్నాయి.


విభజన హామీలు, ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, వైసీపీ పార్టీలు కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండా టీఆర్ఎస్ అడ్డుపడిందా ..లేదా అన్న దానిపై జీ న్యూస్ పోల్ లో మీరు పాల్గొని మీ అభిప్రాయాలు పంచుకోండి.