ఏపీలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. టీడీపీతో సంబంధాలు చెడిపోయిన నేపథ్యంలో బీజేపీ కొత్త మిత్రుల వేటలో పడింది. ఈ క్రమంలో వైసీపీని దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలెట్టిందనే పుకార్లు వినిపిస్తున్నాయి. అదే సమయంలో వైసీపీ కూడా కమలనాథులతో దోస్తీ చేసేందుకు అడుగులు వేస్తున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. తాజా పరిణామాలు కూడా ఈ ఊహాగాలకు బలనిచ్చేవిధంగా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ పై  చర్చకు టీడీపీ ఎంపీల అపాయింట్‌మెంట్ ను రైల్వే మంత్రి తిరస్కరించడం..అదే సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి అపాయింట్‌మెంట్ ఇవ్వడం వంటి పరిణామాలు వైసీపీ-బీజేపీలు దగ్గరవుతున్నాయనే సంకేతలను ఇస్తున్నాయి. అలాగే ఈ రోజు మీడియా సమావేశంలోను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి... ప్రత్యేకహోదా, విభజన హామీలపై టీడీపీని దోషిగా చూపించారు తప్పితే కేంద్రానికి పల్లెత్తు మాట అనలేదు. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ రాష్ట్రానికి ఏ ఒక్క పనిని చేయించలేకపోయిందని ఆరోపించారు.


విజయసాయిరెడ్డి స్పందించిన తీరు... కేంద్రం చేత పనిచేయించడంలో టీడీపీ పూర్తిగా విఫలమైందనే కోణం ఉంది కానీ ..కేంద్రానికి వేలెత్తి చూపినట్లు లేదు...ఇలా తాజా పరిణామాలను గమనిస్తే వైసీపీ- బీజేపీ దోస్తీ చేసేందుకు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.