శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఖాతాలో మరో సంచలన విజయం నమోదైంది. నెల్లూరులోని శ్రీహరికోటలో వున్న సతీష్ ధావన్ స్పేస్ రిసెర్చ్ సెంటర్ నుంచి ఇవాళ సాయత్రం సరిగ్గా 4:10 గంటలకి 2,250 కేజీల బరువైన జీశాట్-7ఏ ఉపగ్రహాన్ని మోసుకుని జీఎస్ఎల్వీ మార్క్2 ఎఫ్ 11 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకుపోయింది. భారత వైమానిక దళం సేవలు నిమిత్తం చేసిన ఈ జీశాట్ 7ఏ ప్రయోగం విజయవంతం అవడంతో 35 రోజుల్లో 3 ఉపగ్రహాలు ప్రయోగించిన ఘనత ఇస్రో సొంతమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన జీశాట్-7ఏ ఉపగ్రహం భారత వైమానిక రంగానికి 8 ఏళ్ల పాటు సేవలు అందించనుంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే సమాచార ఉపగ్రహ శ్రేణిలో రెండు ఉపగ్రహ ప్రయోగాలు చేసిన ఇస్రో.. జీశాట్-7ఏతో మూడో ఉపగ్రహ ప్రయోగాన్ని దిగ్విజయంగా పూర్తిచేసింది. ఇటీవల నవంబర్ 14న జీఎస్ఎల్వీ-ఎంకే-III రాకెట్ ద్వారా జీశాట్-29, నవంబర్ 29న పీఎస్ఎల్వీ-సీ43 ద్వారా హైసిస్ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించిన సంగతి తెలిసిందే.