LVM 3 Launch: ఎల్‌విఎం 3 రాకెట్ ప్రయోగం విజయవంతం.. ఇస్రోకు CM జగన్ అభినందనలు
LVM 3 Launch: శ్రీహరికోట నుంచి ఇస్రో మరో విజయం సాధించింది. ఎల్‌విఎం 3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. వాణిజ్య ప్రయోగాల్లో ఇస్రో ముందంజలో ఉందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.
LVM 3 Launch: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో మైలురాయి చేరుకుంది. పూర్తి స్థాయిలో వాణిజ్యపరంగా న్యూ స్పేస్ ఇండియా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ సంయుక్తంగా తలపెట్టిన రెండవ ప్రయోగమిది. ఈ ప్రయోగం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుంచి అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎల్‌విఎం 3 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 8.30 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభం కాగా ఇవాళ ఉదయం 9 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. యూకేకు చెందిన నెట్‌వర్క్ యాక్సెస్ అసోసియేట్ లిమిటెడ్ కంపెనీ, ఇండియాకు చెందిన భారతి ఎంటర్‌ప్రైజస్ సంయుక్తంగా వన్‌వెబ్ ఇండియా-2 పేరుతో సిద్ధం చేసిన 5,805 కిలోల బరువున్న 36 ఉపగ్రహాల్ని భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహాల్ని లియో ఆర్బిట్‌లో 87.4 డిగ్రీల కోణంలో వృత్తాకార కక్ష్యలో చొప్పించారు. నాలుగేసి ఉపగ్రహాల చొప్పున 9 విడతల్లో మొత్తం 36 ఉపగ్రహాల్ని కక్ష్యలో ప్రవేశపెట్టే కార్యక్రమం జరుగుతుంది.
ఇస్రోకు అభినందనలు
ఎల్‌విఎం 3 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇస్రో బృందానికి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ఎల్‌విఎం 3 విజయవంతం ద్వారా ఇండియా అంతరిక్ష ప్రయోగాల్లో తిరుగులేనిదిగా నిలిచిందన్నారు. ఈ ప్రయోగాన్ని 19.7 నిమిషాల్లో పూర్తయింది.
Also Read: Vande Bharat Express: తిరుపతి-సికింద్రాబాద్ మధ్య వందేభారత్.. ఏప్రిల్‌లో ప్రారంభం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook