ISRO PSLV-C55: పీఎస్‌ఎల్వీ-సీ55 (PSLV-C55) రాకెట్ ప్రయోగం సక్సెస్ అయింది. తిరుపతి జిల్లా షార్‌ నుంచి శనివారం మధ్యాహ్నం 2:20 గంటలకు పీఎస్‌ఎల్వీ-సీ55 రాకెట్‌‌ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ సింగపూర్ కు చెందిన టెలియోస్‌-2, లూమ్‌లైట్‌-4 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

TeLEOS-2 ఉపగ్రహం బరువు 741 కిలోలు కాగా.. LUMELITE-4 వెయిట్ కేవలం 16 కిలోలే. ఈ ప్రయోగాన్ని ఇస్రో షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నిర్వహించింది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు ప్రారంభమై.. కంటిన్యూగా 25.30 గంటల పాటు కొనసాగింది. టెలీయోస్‌-2 ఉపగ్రహం సింగపూర్‌ ప్రభుత్వానికి సంబంధించినది కాగా.. లూమాలైట్‌-4 ఉపగ్రహాన్ని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇన్ఫోకామ్‌ రీసెర్చ్‌, నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌లోని శాటిలైట్‌ టెక్నాలజీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో డెవలప్ చేశారు. 


Also Read: Karnataka Elections: కర్ణాటకలో ఎన్నికల జోరు.. తొలిసారి ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం


ఈ సంవత్సరం ఇస్రోకిది తొలి పీఎస్‌ఎల్వీ ప్రయోగం కాగా.. మెుత్తానికి ఈ సిరీస్‌లో 57వ ప్రయోగమని ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ తెలిపారు. ఏడాదికి 12 రాకెట్‌ ప్రయోగాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ సందర్భంగా ఆయన చెప్పారు.


Also read: Covid Infections india: కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి.. భారీగా పెరిగిన మరణాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook