ప్రధాని మోడీ జనవరి 6న ఏపీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గుంటూరులో ఏర్పాటు చేయనున్న బహింగ సభలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఏపీ ప్రజలకు తీపి కబురు చెబుతారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇంతకీ మోడీ వినిపించే ఆ తిపికబురు ప్రత్యేక హోదా లేదా మరోక భారీ గిఫ్ట్ ఏమైనా ప్రకటిస్తారా అనే దానిపై సర్వత్రా చర్చ మొదలైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విభజన హామీల్లో ఏ ఒక్కటి మోడీ సర్కార్ అమలు చేయలేదన్న ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తుండంపై ఆసక్తి నెలకొంది. ఈ నేపధ్యంలో ఏపీ ప్రజల ఆగ్రహాన్ని చల్లాల్చేందుకు ఏదైనా తీపికబురు చెబుతారా లేదా ప్రతిపక్షాలపై ఎదురుదాడితో సరిపెడతారా అనే దానిపై ఉత్కంఠత నెలకొంది. 


మోడీ సర్కార్ ఏపీ ప్రజలకు మోసం చేసిందని ఆరోపిస్తూ జనవరి 1న టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసర కార్యక్రమాలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం,  ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తుండటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.