IT Raids on Vallabhaneni Vamsi and Devineni Avinash: రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుస ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి గుడివాడ ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రస్తుతం వైసీపీలో చేరి విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న దేవినేని అవినాష్ ఇంట్లో ఐటీ రైడ్ జరుగుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంగళవారం ఉదయం 6:30 గంటల నుంచి ఐటీ అధికారులు విజయవాడలోని దేవినేని అవినాష్ గుణదల నివాసంతో పాటు ఆయన అనుచరుల ఇళ్లలో కూడా తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం ఐదు టీమ్స్ ఈ సోదాల్లో పాల్గొంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంట్లో కూడా తనిఖీలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.


అయితే ఈ ఐటీ సోదాలకు సంబంధించిన కారణాలు మాత్రం వెలుగులోకి రావాల్సి ఉంది. అయితే మరోపక్క హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ప్రముఖ బిల్డర్ అయిన సుబ్బారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై అధికారులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు.


ఇక హైదరాబాద్ లో ప్రతిష్టాత్మక వంశీ రామ్ బిల్డర్స్ కార్యాలయం పై అలాగే ఆ బిల్డర్స్ యాజమాన్యం ఇళ్లలో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి.   వంశీ రామ్ బిల్డర్ సుబ్బారెడ్డి, ఆయన బావమరిది జనార్దన్ రెడ్డి ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం 15 చోట్ల టీమ్స్ గా విడిపోయిన ఐటీ అధికారులు ఈ సోదరులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రైడ్స్ కు గల అసలు కారణం ఏమిటి అనే విషయం మీద మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.


Also Read: Shukra Rashi Parivartan 2022: శుక్రుడు ధనస్సురాశిలోకి సంచారం.. ఈ రాశులవారు నిజంగా లాభాలు పొందుతారా..? 


Also Read: Crime News: ప్రేమను నిరాకరించిందని.. యువతి గొంతుకోసి చంపేసిన ప్రేమోన్మాది!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook