విశాఖ: జగన్ దాడి కేసును పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో నిందితుడు శ్రీనివాసరావు కోడి కత్తిని జనవరిలోనే తెచ్చి హోటల్‌ కిచెన్‌లో దాచిపెట్టాడని పోలీసులు తేల్చారు. సోమవారం విశాఖ పోలీసు కమిషనర్‌ మహేశ్‌చంద్ర లడ్డా మాట్లడుతూ విచారణలో భాగంగా నిందితుడు ఉయోగించిన ట్యాబ్‌‌, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దీంతో పాటు అతనికి చెందిన మూడు బ్యాంకు ఖాతాలు పరిశీలిస్తున్నామన్నారు. నిందితుడు శ్రీనివాసరావుతో పాటు పనిచేస్తున్నవారిని విచారించామని తెలిపారు. లెటర్ గురించి ప్రస్తావిస్తూ.. తన దస్తూరి బాగున్నప్పటికీ ఇతరులతో లేఖ ఎందుకు రాయించాడనేదానిపై దృష్టి పెట్టామని సీపీ పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జగన్ అభిప్రాయాన్నే రిపోర్టులో రాశాం


ఈ సందర్భంగా సీపీ లడ్డా మాట్లాడుతూ  'తల తిప్పుకొని పక్కకు వెళ్లకపోతే మెడ మీద గాయమై.. తీవ్ర ప్రమాదం జరిగి ఉండేదని' జగన్‌ చెప్పిందే రిమాండ్‌ రిపోర్టులో రాశాం. ఇది తమ అభిప్రాయం కాదని.. జగన్‌ చెప్పిందే యథాతథంగా రిమాండ్‌ రిపోర్టులో రాశామని వివరణ ఇచ్చారు. ఈ కేసులో జగన్‌కు 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చాం...విచారణకు ఆయన్ను స్వయంగా పిలుస్తామని పేర్కొన్నారు. దీంతో పాటు దాడి ఘటన ప్రత్యక్ష సాక్షులకు నోటీసులు ఇచ్చి విచారిస్తామని..  విచారణ పూర్తయితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పోలీస్ కమిషనర్ లడ్డా పేర్కొన్నారు.