జగన్ పై దాడి కేసు : నిందితుడిని కస్టడీలోకి తీసుకున్న ఎన్ఐఏ
జగన్ పై కోడికత్తి దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు శ్రీనివాస్ రావును విజయవాడ జిల్లా జైలు నుంచి ఎన్ఐఏ తన కష్టడీలోకి తీసుకుంది. ఇప్పటికే కోర్టు పర్మిషన్ తీసుకున్న ఎన్ఐఏ వారం రోజుల తమ కస్టడీలో ఉంచి విచారణ చేపట్టనుంది. విచారణ నిమిత్తం హైదరాబాద్ లోని ఎన్ఐఏ కార్యలయానికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. ఈ కేసులో విషయంలో ఇప్పటికే అధ్యయనం చేసిన ఎన్ఐఏ టీం..నిందితుడికి అడిగే ప్రశ్నావళిని సిద్ధం చేసుకుంది. విచారణ ముగిసిన అనంతరం అంటే.. ఈ నెల 25న మళ్లీ నిందితుడిని కోర్టుముందు హాజరుపర్చాల్సి ఉంది.
హైకోర్టు ఆదేశాలతో కోడికత్తి దాడి కేసును ఏపీ పోలీసులు కేసు విచారణను ఎన్ఐఏకి అప్పగించారు. దీంతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ విచారణ చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో శుక్రవారం విజయవాడ కోర్టులో నిందితుడిని హాజరుపర్చగా..కోర్టు ఎన్ఐఏ కష్టడీకి ఇచ్చేందుకు అంగీకరించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు నిందితుడు శ్రీనివాసరావును కష్టడీలోకి తీసుకున్నారు.
షరతులతో కూడిన కష్టడీ..
నిందితుడు శ్రీనివాస్ విషయంలో విజయవాడ కోర్టు.. ఎన్ఐఏకు కోర్టు కొన్ని షరతులతో కూడిని కష్టడీకి అంగీకరించింది. నిందితుడిపై థార్డ్ డిగ్రీ ప్రయోగించరాదని న్యాయస్థానం పేర్కొంది. నిందితుడు కోరితే న్యాయవాది సమక్షంలో విచారణ ఎదొర్కోవచ్చని తెలిపింది. అలాగే నిందితుడికి మూడు రోజులకు ఒక సారి వైద్య పరీక్షలు నిర్వహించాలని న్యాయ స్థానం ఆదేశించింది. న్యాయం ఆదేశాల మేరకు ఎన్ఐఏ పాటించాల్సి ఉంది.