జగన్ దాడి కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ప్రముఖ మీడియా కథనం ప్రకారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న శ్రీనివాస్ రావుకు వైరల్ ఫీవర్ సోకింది. జైల్లో ప్రధమ చికిత్స చేసినా ఫలితం లేకండాపోయింది. దీంతో అతన్ని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించి అధికారులు చికిత్స అందిస్తున్నారు. 


అత్యసవర విభాగంలో అతనికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు .కాగా ఆస్పత్రిలో శ్రీనివాస్ ను పరామర్శించేందుకు అతని బంధువులు వచ్చారు. అయితే శ్రీనివాస్ అనారోగ్యం విషయాన్ని  పోలీసు అధికారులు గోప్యంగా ఉంచారు