జగన్ పాదయాత్ర వాయిదా ! ..6 నుంచి మొదలు
వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు అడుగడుగునా ఆటంకాలు ఎదురౌతున్నాయి. ప్రజా సమస్యలే లక్ష్యంగా నవంబర్ 2 నుంచి పాదయాత్ర చేపట్టాలని జగన్ భావించారు. అయితే అక్రమాస్తుల కేసులో విచారణలో భాగంగా ఆయన నవంబర్ 3న కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన తన పాదయాత్రను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని సీబీఐ కోర్టుకు జగన్ విజ్ఞప్తి చేసినప్పటికీ... కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో జగన్ తన పాదయాత్రను నవంబర్ 6 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు.