చంద్రబాబు హామీలపై జగన్ సూటి ప్రశ్నలు
ఎన్నికల హామీలపై ఏపీ సీఎం చంద్రబాబుకు జగన్ బహిరంగ లేఖ రాశారు.
ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ అమలు చేసిన పాపాన పోలేదని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. ఎన్నికల హామీలపై ఏపీ సీఎం చందబ్రాబుకు జగన్ బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా టీడీపీ హామీల అంశాలను ప్రస్తావిస్తూ ఏపీ సర్కార్ కు జగన్ పలు ప్రశ్నలను సంధించారు.
సూటి ప్రశ్నలివే..
* రైతుల రూణాలను పూర్తిగా మాఫీ చేస్తానన్నారు ..చేశారా ?
* డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్నారు..చేశారా ?
* బెల్టు షాపులు రద్దు సంతకం ఏమైంది ?
* నిరుద్యోగ భృతి హామీ ఏమైంది..?
* రిజర్వేషన్లపై ప్రభుత్వ వైఖరేంటి ?
* మహిళా రక్షణ టీంలు ఎక్కడున్నాయి ?
* రూ.2 కే మినరల్ వాటర్ ఇస్తున్నారా ?
* మహిళలందరిరీ ఉచితంగా ఫోన్లు ఇస్తానన్నారు..ఇచ్చారా ?
తాము నెరవేర్చే హామీలు మాత్రమే ఇస్తానని..అధికారంలోకి రాగానే దాన్ని కచ్చితంగా అమలు చేస్తామని జనగ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.