ఇండోపాక్ యుద్ధంపై పవన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో దీనిపై జనసేన పార్టీ స్పందించింది. ఇండో పాక్ మధ్య యుద్ధం వస్తుందని తనకు బీజేపీ నేతలు చెప్పారనే పవన్ కల్యాణ్ మీద కథనాలకు జనసేన పార్టీ ఖండించింది. దేశ ఆర్ధిక పరిస్ధితులు, నిఘా వర్గాల హెచ్చరికల పరిగణనలోకి తీసుకొని కొందరు మేధావులు ప్రస్తావన ఆధారంగా  పవన్ ఇలా వ్యాఖ్యనించారు తప్పితే ఆయనకు..బీజేపీ వారు కానీ.. పాకిస్తాన్ కు చెందిన వారెవరూ యుద్ధం గురించి చెప్పలేదని చెప్పలేదని జనసేన పార్టీ వివరణ ఇచ్చింది.



ఇండో పాక్ యుద్ధంపై  జనసేన చీఫ్  పవన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. కర్నూలు జిల్లాలో జనసేన నిర్వహించిన ర్యాలీలో పవన్ ప్రసంగిస్తూ... రెండేళ్ల క్రితమే యుద్ధం వస్తునందని తనకు బీజేపీ నేతలు చెప్పారంటూ  సంచలన ఆరోపణల చేశారు. ఈ వ్యాఖ్యలను ప్రాంతీయ మీడియాతో పాటు జాతీయ మీడియా కూడా ప్రచురించింది. సరిగ్గా ఇదే  న్యూస్ పాకిస్తాన్ మీడియా కంటపడింది. పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ  పత్రిక డాన్ కూడా పవన్ వ్యాఖ్యలను కోట్ చేస్తూ తన వెబ్ సైట్ లో ప్రచురించింది. ఎన్నికల ముందు యుద్ధం వస్తుందని రెండేళ్ల క్రితమే బీజేపీ నేతలు చెప్పారని అందులో ఉంది. ఈ క్రమంలో ఇది వివాదంగా మారి జాతీయ ప్రాధాన్యత అంశంగా నిలబడటంతో దీనిపై జనసేన పార్టీ వివరణ ఇచ్చింది.