కామన్వెల్త్ పతకం గెలిచిన తెలుగోడికి.. రూ.10 లక్షల బహుమతి ప్రకటించిన పవన్ కళ్యాణ్
కామన్వెల్త్ క్రీడల్లో గుంటూరు జిల్లాకి చెందిన వెయిట్‌లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్ 84 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో స్వర్ణం గెలుచుకున్న సంగతి తెలిసిందే.
కామన్వెల్త్ క్రీడల్లో గుంటూరు జిల్లాకి చెందిన వెయిట్‌లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్ 84 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో స్వర్ణం గెలుచుకున్న సంగతి తెలిసిందే. స్నాచ్‌లో 151 కేజీలు ఎత్తడంతో పాటు, క్లీన్ అండ్ జర్క్‌లో 187 కేజీలు ఎత్తి.. ఫైనల్‌గా 338 కేజీల రికార్డు నమోదు చేసి ఈ ఘనతను ఆయన సాధించాడు. 2014లో జరిగిన సమ్మర్ యూత్ ఒలింపిక్స్‌లో కూడా రాహుల్ వెయిట్ లిఫ్టింగ్‌లో రజతం గెలుచుకున్నాడు. ఈ క్రమంలో జనసేన పార్టీ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, రాహుల్‌కి రూ.10 లక్షల రూపాయలను బహుమతిగా ప్రకటించారు. భారతదేశం గర్వపడేలా క్రీడల్లో అత్యున్నత ప్రదర్శనను కనబరిచినందుకు జనసేన తరఫున రాహుల్‌కి ఈ బహుమతిని ప్రకటించినట్లు ఆయన తెలిపారు.