Pawan Kalyan: ఉక్కు సంకల్పంతో ఎదుర్కొనే నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ.. పవన్ కళ్యాణ్ పొగడ్తల వర్షం
Pawan Kalyan On PM Modi: ఇటీవల ఏపీ పర్యటనకు విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖలో కలిశారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులను మోదీకి పవన్ వివరించారు.
Pawan Kalyan On PM Modi: ప్రధాని నరేంద్ర మోదీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొగడ్తల వర్షం కురిపించారు."ఎంత ఎత్తుకు ఎదుగుతాడో మనిషి ఈ కఠిన ధరిత్రి మీద.. అంత దీర్ఘంగా పడుతుంది చరిత్రలో అతని నీడ.. శేషేంద్ర చెప్పిన ఈ కవితా పంక్తులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రస్థానానికి అద్దం పడతాయి. క్లిష్ట సమయంలో పాలన చేపట్టి ప్రాంతీయవాదాలు, సాంస్కృతిక వైరుధ్యాలు.. అన్నింటినీ అర్థం చేసుకొని సమాదరించి ప్రతి ఒక్కరిలో భారతీయులం అనే భావన నింపారు.
ప్రజారోగ్యానికి వాటిల్లిన విపత్తు, దేశ భద్రతకు పొంచి ఉన్న ముప్పు నుంచి రక్షణకు అహరహం తపించారు. ప్రతి కఠిన పరిస్థితినీ ఉక్కు సంకల్పంతో ఎదుర్కొనే నాయకత్వ పటిమగల పురోగమనశీలి నరేంద్ర మోదీ గారు..'' అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ప్రధానితో భేటీకి సంబంధించిన ఫొటోను షేర్ చేసుకున్నారు.
ఇటీవల వైజాగ్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న అన్ని అంశాలపై చర్చించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. తెలుగు ప్రజల అభివృద్ధి కోసమే, తెలుగు ప్రజలు వర్ధిల్లాలనే కాంక్షతోనే ప్రధానిని కలిసినట్లు చెప్పారు. ప్రధాని కార్యాలయం నుంచి తనకు ముందే పిలుపు వచ్చిందని.. వారి ఆహ్వానం మేరకే ప్రధానిని కలిసినట్లు పేర్కొన్నారు.
2014 తరువాత 8 ఏళ్ల తరువాత ప్రధాని మోదీని పవన్ కళ్యాణ్ కలిశారు. ఈ 8 ఏళ్ల కాలంలో తాను ఢిల్లీకి వెళ్లినా.. ఎప్పుడూ ప్రధాని నరేంద్ర మోదీని కలవలేదు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల గురించి ప్రధాని మోదీ అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నట్లు పవన్ చెప్పారు. భవిష్యత్‌లో ఏపీకి మంచి రోజులు వస్తాయని నమ్మకం కలుగుతోందని మోదీతో భేటీ అనంతరం మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
Also Read: CM KCR: కేటీఆర్‌కు సీఎం పగ్గాలా..? అసెంబ్లీ రద్దా..? కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ
Also Read: Vijay Hazare Trophy: ఆసుపత్రిపాలైన యంగ్ క్రికెటర్.. నొప్పితో విలవిల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి