గొప్ప మనసు.. అమరుల కుటుంబాలకు కోటి రూపాయల విరాళం అందించిన పవన్ కల్యాణ్
అమరుల త్యాగాలను గుర్తించాలని, వారి కుటుంబాలకు అండగా నిలవాలని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. సైనిక్ బోర్డుకు కోటి రూపాయల విరాళం అందించారు.
న్యూఢిల్లీ: సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గురువారం దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. అర్.కె.పురంలోని కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయానికి వెళ్లిన పవన్.. అమరవీరుల కుటుంబాల కోసం కోటి రూపాయల చెక్కును అందజేశారు. అమరులైన సైనికుల కుటుంబాలకు సహాయం చేయాలని కోరుతూ బ్రిగేడర్ వీరేంద్ర కుమార్ తనకు లేఖ రాసినట్లు వెల్లడించారు. వీరేంద్ర కుమార్ లేఖ తనను కదిలించిందన్నారు. ఈ మేరకు కోటి రూపాయల చెక్కును వారి సహాయార్థం అంచించినట్లు చెప్పారు.
Also Read: భారతీయుడు 2 షూటింగ్‌లో ప్రమాదం.. క్రేన్ కూలి ముగ్గురి దుర్మరణం
తన గత ఢిల్లీ పర్యటనలోనే విరాళానికి సంబంధించిన చెక్కును అందించాలనుకున్నా వీలు చిక్కలేదని పవన్ వివరించారు. దేశాన్ని, సైనికులను ప్రేమించే ప్రతి ఒక్కరు సైనిక్ బోర్డుకు తమకు తోచినంతమేర సహాయం చేయాలని పవన్ పిలుపునిచ్చారు. మనం చేసే సాయం కొంత అయినా అమరుల కుటుంబాలకు అది ఎంతో ప్రయోజనకరమని అభిప్రాయపడ్డారు.
Also Read: ముగ్గురు సహోద్యోగుల్ని కోల్పోయా: కమల్ హాసన్ భావోద్వేగం
మధ్యాహ్నం విజ్ఞాన భవన్‌లో జరగనున్న ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పవన్ పాల్గొననున్నారు. యువతలో రాజకీయ చైతన్యాన్ని పెంపొందించడానికి ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో పవన్ పాల్గొని ప్రసంగిస్తారు. విద్యార్థులు అడిగే ప్రశ్నలకు జనసేన అధినేత సమాధానాలు ఇస్తారు. పవన్ కల్యాణ్ గురించి రూపొందించిన లఘుచిత్రాన్ని (షార్ట్ ఫిలిం) ఈ సందర్భంగా ప్రదర్శించనున్నారు.
See Pics: టాప్ లేపిన ముద్దుగుమ్మలు!
See Pics: అందాల గేట్లు ఎత్తేసిన భామలు