Free Ambulances: అత్యవసర సమయంలో, మనిషి ప్రాణాలను నిలబెట్టడానికి అంబులెన్సుల సేవలు ఎంతో ఉపయోగపడతాయని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా, రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడు ఉచిత అంబులెన్స్ సర్వీసులను మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఆదివారం పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుమారు రూ.30 లక్షల సొంత వ్యయంతో బత్తుల బలరామకృష్ణ ఏర్పాటు చేసిన ఈ మూడు అంబులెన్సులలో అత్యాధునిక వెంటిలేటర్లు, అధునాతన లైఫ్ సపోర్టు యంత్రాలతో పాటు 40 రకాల వైద్య పరికరాలు పేషెంట్స్‌కి అందుబాటులో ఉండనున్నాయి. ఈ మూడు అంబులెన్సులు రాజానగరం నియోజకవర్గం పరిధిలోని ప్రజలకు ఉచితంగా సేవలు అందించనున్నాయి. అత్యవసర సేవలు అవసరమైన బాధితులు ఫోన్ చేసిన వెంటనే వారికి అంబులెన్సులు చేరేలా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేక ఫోన్ నెంబర్ల వ్యవస్థ ఏర్పాటు చేశారు. 



 


జనసైనికుడికి రూ. 5 లక్షల ప్రమాద బీమా 
నెల్లూరు జిల్లా కావలిలో జనసేన పార్టీ అభివృద్ధి కోసం చురుకుగా పనిచేసి పార్టీ కోసం కృషిచేసిన జన సైనికుడు బలికిరి ప్రణయ్ కుమార్ ఇటీవల అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. ఈ విషయాన్ని నెల్లూరు జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి, కావలి నియోజకవర్గ ఇంచార్జ్ అలహరి సుధాకర్‌లు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పవన్ కళ్యాణ్ ఆహ్వానం మేరకు ప్రణయ్ కుటుంబ సభ్యులు మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ని కలిశారు. 


ఈ సందర్భంగా ప్రణయ్ తల్లి వరలక్ష్మి, సోదరి ప్రగతిలతో మాట్లాడి వారి ప్రస్తుత పరిస్థితుల గురించి, యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్న అనంతరం జనసేన పార్టీ ప్రవేశపెట్టిన కీయాశీలక సభ్యత్వం ప్రమాద బీమా పథకం నుంచి రూ.5 లక్షల ఆర్ధిక సాయం అందించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) హామీ ఇచ్చారు.


Also Read : Pawan Kalyan: నేను రాజకీయాల్లోకి వచ్చిందే అందుకు


Also Read : MP Raghu Rama Krishnam Raju: ఆర్జీవీ 'వ్యూహం' మూవీకి కౌంటర్.. గండ్ర గడ్డలి, కోడి కత్తి సినిమాలు వస్తాయి: ఎంపీ రఘురామ


Also Read : Nagababu Birthday: మా చిన్నన్నయ్య ధృడంగా నిలబడే వ్యక్తి.. ఆయనకు ప్రత్యేక స్థానం: పవన్ కళ్యాణ్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి