Pawan Kalyan Election Campaign Vehicle: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు మరో ఏడాదిన్న సమయం ఉన్నా.. ఇప్పటికే అన్ని పార్టీలు కదనరంగంలోకి దూకేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నారు. త్వరలో బస్సు యాత్ర నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుండగా.. ఇందుకు సంబంధించిన వాహనం రెడీ అయింది. ఈ వాహనంలో జనసేనానిని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రభుత్వంపై పోరాడనున్నారు. తన ప్రచార వాహనానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వాహనానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ.. ఎన్నికల యుద్ధానికి వారాహి సిద్ధం అంటూ ఆయన క్యాప్షన్ ఇచ్చారు. వాహనం చుట్టూ బాడీ గార్డులు నడుచుకుంటూ.. వాహనం రెండు వైపులా ఇద్దరు నిల్చున్న వీడియోను పవర్‌ఫుల్‌గా చిత్రీకరించారు. వారహి వాహనాన్ని పరిశీలిస్తున్న ఫొటోలను కూడా ఆయన పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోను పవన్ ఫ్యాన్స్, జనసేన నేతలు వైరల్ చేస్తున్నారు.  



 


ఈ వాహనాన్ని ట్రయల్ రన్‌ను పవన్ కళ్యాణ్ బుధవారం హైదరాబాద్‌లో పరిశీలించారు. వాహనానికి సంబంధించి కొన్ని ముఖ్య సూచనలను పార్టీ నాయకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌కు ఇచ్చారు. వాహనాన్ని తీర్చిదిద్దుతున్న సాంకేతిక నిపుణులతోను చర్చించారు. దుర్గాదేవి సప్త మాతృకల్లో ఒకరు వారాహి. ఈ వాహనానికి వారాహి అమ్మవారి పేరుపెట్టారు. అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా పురాణాలు చెబుతాయి. దుర్గా దేవి సప్త మాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు. ఆ సప్త మాతృకలు రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరించారు. అందుకే తన ప్రచార వాహనానికి పవన్ కళ్యాణ్ వారాహి అని పేరు పెట్టారు.


అత్యాధునిక టెక్నాలజీతో.. మెరుగైన హంగులతో వారాహి వాహనాన్ని సిద్ధం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ వాహనాన్ని దగ్గర ఉండి రెడీ చేయించారు. ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. మార్పులను సూచించారు. పుణేలో వాహనాన్ని తయారు చేయించాలని పార్టీ నేతలు అనుకోగా.. తరువాత పవన్ సలహా మేరకు హైదరాబాద్‌లోనే సిద్ధం చేయించారు. చివరకు అదిరిపోయే లుక్‌తో అత్యాధునిక వసతులతో వారాహి వాహనం రెడీ అయింది.


Also Read: Delhi MCD Election Result: ఢిల్లీ కార్పొరేషన్ పీఠం ఆప్ కైవసం.. బీజేపీ చేసిన తప్పులు ఇవే..  


Also Read: Cyclone Mandous: ఏపీ వైపు దూసుకువస్తున్న తుఫాన్.. ఈ జిల్లాల్లో హైఅలర్ట్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter,  Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి