జనసేన పార్టీలో చేరే వ్యక్తులు సభ్యత్వం తీసుకొనేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్‌లోని జనసేన పార్టీ ఆఫీసులో జరిగిన చిన్న వేడుకలో ఆయన పార్టీ వెబ్‌సైట్‌లో ఫారమ్ నింపి.. జనసేన తొలి సభ్యుడిగా చేరారు. ఆ తర్వాత పార్టీలోని సభ్యులకు ఆయన స్వయంగా సభ్యత్వ పత్రాలను అందజేశారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొద్ది రోజుల్లో ఇరు తెలుగు రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ప్రతీ వార్డు పరిధిలో జరుగుతాయని చెప్పారు. సభ్యత్య నమోదు కార్యక్రమంలో భాగంగా తన ముఖ్య కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ నియమాలను వారికి తెలిపారు. అలాగే త్వరలో జనసేన ఆధ్వర్యంలో యువతకు, వయోధిక కార్యకర్తలకు శిక్షణ శిబిరాలు, వర్క్ షాపులు కూడా ప్రారంభవుతాయన్నారు.