Pawan Kalyan on CM post: సీఎం పదవిపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Pawan Kalyan comments on CM post: తిరుపతి: తనకు సీఎం పదవిపై ఆశ లేదని.. సీఎం కాకపోయినా సేవ చేస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. సీఎం అయితేనే అని కాదు.. కాకపోయినా సరే ఇంకా ఎక్కువ సేవే చేస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీకి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్.. సామాన్యులపై అధికార పార్టీ (YSRCP) ప్రతాపం చూపిస్తోందని మండిపడ్డారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తిరుపతి ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ''తిరుపతిని ఎవరు అభివృద్ధి చేయగలరో ఆలోచించి ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేసిన పవన్ కళ్యాణ్... త్వరలోనే రాష్ట్రం దశ, దిశ మారాల్సిన అవసరం ఉంది'' అని అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగిస్తూ పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఏపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్, జనసేన పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ తదితరులు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
Also read : Covid19 Update: ఏపీలో పెరుగుతున్న కరోనా వైరస్ కొత్త కేసులు, పరీక్షలు ముమ్మరం చేసిన ప్రభుత్వం
బీజేపీ అభ్యర్థి, మాజీ ఐఏఎస్ అధికారిణి అయిన రత్నప్రభ (Ratnaprabha) తరపున తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో శనివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా బయల్దేరి వెళ్లి తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో (Tirupati bypoll campaign) పాల్గొన్నారు.
తిరుపతి లోక్ సభ స్థానానికి ఏప్రిల్ 17న ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. తిరుపతి నుంచి లోక్ సభ సభ్యుడిగా సేవలు అందించిన వైఎస్సార్సీపీ నేత బల్లి దుర్గాప్రసాద్ రావు (MP Balli Durgaprasad Rao's death) సెప్టెంబర్ 16న కరోనాతో మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook