Glass Symbol: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీకి భారీ షాక్‌ తగిలింది. అన్‌ రిజర్వ్‌డ్‌ కేటగిరిలో ఉన్న గాజు గ్లాసు గుర్తు వేరే వారికి కూడా కేటాయించింది. జనసేన పార్టీ పోటీ చేస్తున్న 22 అసెంబ్లీ, 2 పార్లమెంట్ అభ్యర్థులకు గాజు గ్లాస్‌ గుర్తు కేటాయించగా.. ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు ఆ గుర్తును కేటాయించింది. ఈ పరిణామంతో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేనలు ఆందోళన చెందుతున్నాయి. జనసేన పోటీ చేయని స్థానాల్లో పవన్‌ కల్యాణ్‌ అభిమానులు, ప్రజలు గాజు గ్లాస్‌ గుర్తుకు ఓటేస్తారేమోననే భయాందోళన మొదలైంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Glass Symbol: జనసేన పార్టీకి గుడ్‌న్యూస్‌.. ఎట్టకేలకు 'గాజు గ్లాస్‌' గుర్తు కేటాయింపు


ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్లు పూర్తవగా సోమవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా పూర్తయ్యింది. నామినేషన్ల ఉపసంహరణ పూర్తవడంతో బరిలో ఉన్న తుది అభ్యర్థులకు ఎన్నికల సంఘం గుర్తులు కేటాయించింది. ఈ క్రమంలో ఇంకా గుర్తింపు పొందని జనసేన పార్టీకి ప్రత్యేక విజ్ఞప్తితో 'గాజు గ్లాస్‌' గుర్తు కేటాయించింది. ఆ పార్టీ పోటీ చేస్తున్న స్థానాల్లో గాజు గ్లాస్‌ గుర్తు కేటాయించేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా పొత్తులో భాగంగా జనసేన పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్‌ గుర్తు కూడా కేటాయించింది.

Also Read: YS Jagan Convoy: కాన్వాయ్‌ కిందపడ్డ కుక్క.. చలించిపోయిన సీఎం వైఎస్ జగన్‌ 


జనసేన పోటీలో లేని చోట్ల గాజు గ్లాసు ఫ్రీ సింబల్‌గా స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం కేటాయించింది. కాకినాడ జిల్లా జగ్గంపేటలో పాఠంశెట్టి సూర్యచంద్రకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. జనసేన రెబెల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సూర్యచంద్రకు లాటరీలో గాజు గ్లాసు లభించడం గమనార్హం. ఇదే నియోజకవర్గంలో  తెలుగుదేశం పార్టీ నుంచి జ్యోతుల నెహ్రూ పోటీ చేస్తున్నారు. గాజు గ్లాస్‌ గుర్తు సూర్యచంద్రకు కేటాయించడంతో జనసేన ఓట్లన్నీ అతడికే పడుతాయని టీడీపీ ఆందోళన చెందింది. జ్యోతుల నెహ్రూకు పవన్‌ అభిమానుల ఓట్లు పడతాయా? అనేది ఆసక్తికరంగా మారింది.


విజయనగరం అసెంబ్లీ బరిలో తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థి మీసాల గీతకు అనూహ్యంగా లాటరీలో గాజుగ్లాస్ గుర్తు దక్కింది. మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్‌ ఉర్తు కేటాయించినట్లు తెలుస్తోంది. ఆ గుర్తు ఇతరులకు కేటాయించడంతో కూటమి అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. పొత్తులో భాగంగా జనసేన పోటీ చేయని స్థానాల్లో  గాజు గ్లాస్ గుర్తు ప్రజలను గందరగోళానికి గురి చేసే అవకాశం ఉంది.


పొత్తులో భాగంగా బీజేపీ, టీడీపీలకు జనసేన ఓట్లు పడాల్సి ఉంది. కానీ స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్‌ గుర్తు దక్కడంతో ఆ అభ్యర్థులకు జనసేన పార్టీ నాయకులు, పవన్‌ కల్యాణ్‌ అభిమానులు వారికి ఓటు వేసే అవకాశం ఉంది. జనసేన ఓట్లన్నీ స్వతంత్ర అభ్యర్థులకు పడితే పోటీలో ఉన్న టీడీపీ, బీజేపీ అభ్యర్థుల ఫలితంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter