Janasena Satires: జోగి రమేష్ మగాడివైతే.. మంత్రికి జనసేన నేత సవాల్
Janasena Leader Satires on Minister Jogi Ramesh: పెడన: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ నేత రాంసుధీర్ ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. మైలవరం నుంచి అక్కడి ప్రజలు తన్ని తరిమేస్తేనే.. పెడన వచ్చి పడ్డాడు అని అన్నారు.
Janasena Leader Satires on Minister Jogi Ramesh: పెడన: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ నేత రాంసుధీర్ ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. మైలవరం నుంచి అక్కడి ప్రజలు తన్ని తరిమేస్తేనే.. పెడన వచ్చి పడ్డాడు అని అన్నారు. పెడన నియోజకవర్గ ప్రజలు అతని మాయలు నమ్మి గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలను మోసం చేశాడు అని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ని దూషిస్తూ మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలపై మంత్రికి కౌంటర్ ఇచ్చిన సుధీర్.. నీ చమ్మా చక్కా మాటలు వెళ్లి నీ అధినేత వద్ద మాట్లాడుకో కానీ మా నాయకుడిని అంటే చూస్తూ ఊరుకోం అని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు.. జోగి రమేష్ మగాడివైతే.. 2024లో పెడన నుంచి పోటీ చేసి నీ మగతనం నిరూపించుకో అని మంత్రికి సవాల్ విసిరారు.
మరొకసారి నువ్వు పెడన నుంచి పోటీ చేస్తే ఇక్కడి ప్రజలు కూడా నిన్ను ఇక్కడి నుంచి తరిమి కొట్టడం ఖాయం అని సుధీర్ అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పెడన అభివృద్ది చెందలేదు కానీ మంత్రి జోగి రమేష్, ఆయన అనుచరులు చాలా అభివృద్ది చెందారు అని ఆరోపించారు. నీ పబ్లిసిటీ, నీ వారుసుడి పబ్లిసిటీ తప్ప.. ప్రజలకు నువ్వు చేసిందేమీ లేదన్నారు. వాలంటీర్ల బాగు కోసం మా అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడితే అందులో తప్పులు వెతుక్కుంటూ వారిని అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తారా అని మంత్రి జోగి రమేష్ ని నిలదీశారు.
వైసీపీ చెంచాగాళ్లను వాలంటీర్ల ముసుగులో మా మీదకు ఉసి గొల్పుతున్నారు అని రామ్ సుధీర్ మంత్రి జోగి రమేష్ పై మండిపడ్డారు. నిజంగా వాలంటీర్ల సంక్షేమం గురించి మాట్లాడే వాళ్లే అయితే, నీకు కూడా ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా.. వారిని వాలంటీర్లను చేసి చూపించు అంటూ రామ్ సుధీర్ మరో సవాల్ విసిరారు. నీ కొడుకులకేమో రాజకీయ భవిష్యత్ కావాలా.. అమాయకులు మాత్రం వాలంటీర్లుగానే ఉండాలా అంటూ మంత్రిపై ప్రశ్నలవర్షం కురిపించారు. జనసేన నాయకులపై దాడి చేసి జనసేను భయపెట్టాలనుకుంటే భయపడం అని స్పష్టంచేసిన సుధీర్.. వైసీపీ పరిపాలన పబ్లిసిటీ పీక్.. అభివృద్ది ఫలాలు మాత్రం వీక్ అని సెటైర్లు వేశారు. పోలీసు బలగాల రక్షణతో ప్రెస్ మీట్ పెట్టి మరీ జనసేన నేత యడ్లపల్లి రాంసుధీర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.