శ్రీకాకుళం: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టి ఆయన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాడనే నేరం కింద రాజాం నియోజకవర్గానికి చెందిన జనసేన కార్యకర్త పనతల హరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం జగన్‌పై ఫేస్‌బుక్‌లో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టాడంటూ హరిపై వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


వైసీపి నేతల ఫిర్యాదుతో హరిపై కేసు నమోదు చేసిన గుంటూరు పోలీసులు.. హరిని అదుపులోకి తీసుకోవాల్సిందిగా రాజాం నియోజకవర్గంలోని రేగిడి పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అలా గుంటూరు పోలీసుల విజ్ఞప్తి మేరకు రేగిడి హరిని అరెస్ట్ చేయగా.. భయాందోళనకు గురైన అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో హరిని అడ్డుకున్న పోలీసులు అతడిని గుంటూరు పోలీసులకు అప్పగించారు.