Pawan Kalyan: ఏపీలో వైసీపీ పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. రాజకీయంగా తనను ఎదుర్కొలేకనే కులాల ప్రస్తావన తీసుకొస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధిపై జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే..వాటికి సమాధానం చెప్పలేక తనకు కులం రంగు పులుముతున్నారన్నారు. ఇలాంటి వాటికి ధీటుగా సమాధానం చెప్పాలని జనసేన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నా..ధనం మాత్రం కొందరి వద్దే ఉండిపోతోందన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సమాజంలో వ్యవస్థలన్నీ మారాలన్నారు పవన్ కళ్యాణ్. జనసేన పవర్‌లోకి వస్తే వీటిని మారుస్తామని స్పష్టం చేశారు. వైసీపీ నేతల ఢిల్లీ టూర్ రహస్యం అందరికీ తెలుసని ఫైర్ అయ్యారు. ఆ పార్టీ ఎంపీలు ప్రధాని ముందు మాట్లాడలేరని విమర్శించారు. రాజకీయాల మార్పు జనసేనతోనే సాధ్యమవుతుందన్నారు పవన్ కళ్యాణ్. జనసేన ఆవిర్భవించిందే ప్రశ్నించేందుకని గుర్తు చేశారు. వ్యవస్థలను మార్చేందుకు జనసేన కృషి చేస్తోందన్నారు. 


తాను కేసులకు భయపడే వ్యక్తిని కాదని..తమ పార్టీ అధికారంలోకి రాగానే అందరి లెక్కలు తేలుస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అప్పులు చేస్తోందని..వాటినే అభివృద్ధిగా చూపుతోందని మండిపడ్డారు. మూడేళ్ల పాలనలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉపాధి లేక ప్రజలంతా అల్లాడిపోతున్నారని గుర్తు చేశారు. 


రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతల ఆధ్వర్యంలో ఇసుక దందా నడుస్తోందన్నారు పవన్ కళ్యాణ్. గుడివాడలో ఇష్టానుసారంగా దందా సాగుతున్నా పట్టించుకునే వారు లేరని ఫైర్ అయ్యారు. అధికారులంతా ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. తాను పదవి కోరుకునే వాడిని కాదని..పదవి కోరుకుని ఉంటే 2009లోనే ఎంపీ అయ్యేవాడిని గుర్తు చేశారు. పాలించడం, పార్టీని నడపడం తమకూ సాధ్యమన్నారు. తమకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 


దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. ఇందులోభాగంగా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జెండా వందనం ఘనంగా జరిగింది. జాతీయ జెండాను ఆ పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఎగురవేశారు. ఈసందర్భంగా ఏపీ రాజకీయాలపై స్పందించారు.


Also read:Prabhas Salaar Movie Update: సలార్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. వచ్చే ఏడాదిలో ఎప్పుడంటే?


Also read:Tollywood: 75వ స్వాతంత్ర దినోత్సవం సంధర్భంగా టాలీవుడ్ స్టార్స్ శుభాకాంక్షలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook