ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటినుంచి ఐదోవిడత 'జన్మభూమి- మా ఊరు' కార్యక్రమం ప్రారంభం కానుంది. జనవరి 2 నుండి జనవరి 11 వరకు పదిరోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శిలో పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇలా 10 రోజులపాటు రోజుకో జిల్లాలో పాల్గొంటారు. ఈ క్రమంలో అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రధానం లక్ష్యం అని సీఎం అన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"జన్మభూమి-మా ఊరుతో ఐదోసారి ప్రజలవద్దకు ప్రభుత్వం వస్తోంది. ప్రజాప్రతినిధులు, పాలనావ్యవస్థ మీ ఊరిలో అందుబాటులో ఉంటారు. ప్రతి కుటుంబ ఆదాయం నెలకు 10 వేల రూపాయలకు తగ్గకుండా ఉండేందుకు కృషి చేస్తున్నాం. అవినీతిని నిర్మూలించడానికి 1100 కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం. రాష్ట్రంలోని ప్రతిఇంటినీ విజ్ఞానఖనిగా మార్చేందుకు ఫైబర్ గ్రిడ్ ను ప్రారంభించాం. ఫిర్యాదుల్ని పరిష్కరించడం, ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించడం, అధికారుల్లో జవాబుదారీ పెంచడం జన్మభూమి ప్రధాన లక్ష్యం" అన్నారు. 


ఈ సందర్భంగా సమాచార-పౌరసరఫరాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గడిచిన మూడేళ్లలో సాధించిన విజయాలను ఉటంకిస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది. 


* రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నిరంతర విద్యుత్ సరఫరా, ఎల్ఫీజీ కనెక్షన్లు 


* 2018 మర్చి 31 నాటికి 100% ఓడిఎఫ్ రాష్ట్రంగా అవతరించాలని లక్ష్యం, ఇప్పటికే ఈ దిశగా 80% సంపూర్ణం.


* పట్టిసీమ, పురుషోత్తమపట్నం ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు, బృహత్తరమైన పోలవరం ప్రాజెక్టు చేపట్టడం


*లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసే సాగునీరు, కోట్లాది ప్రజల దాహార్తిని తీర్చే తాగునీరు ఇవ్వాలన్నదే లక్ష్యం


* రూ.24000 కోట్ల రుణాల మాఫీతో రైతన్నలకు అండగా నిలవడం జరిగింది