సంచలన పొలిటిషన్ జేసీ దివాకర్ రెడ్డి మరో మారు సంచలన వ్యాఖ్యాలు చేసి వార్తల్లో నిలిచారు. కడప లో ఏర్పాటు చేసిన టీడీపీ ధర్మపోరాట సభలో ఆయన చంద్రబాబు సమక్షంలో రెచ్చిపోయి ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడీ, జగన్ లపై తీవ్ర వ్యాఖ్యాలు చేశారు.  మోడీని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన పెళ్లి పెటాకులు లేని సన్యాసి అని..  మమకారం అంటే తెలియదని ఆయనకు ప్రజల ఇబ్బందులు ఏం తెలుస్తాయని ఎద్దేవ చేశారు. ప్రధాని హోదాలో ఉన్న మోడీ ఇప్పటి వరకు .. తుపాను బాధితులను ఎందుకు ఆదుకోలేదని జేసీ ప్రశ్నించారు. ఇదే సందర్భంలో జగన్ గురించి ప్రస్తావిస్తూ ఆయనకు రాజకీయ ప్రయోజనాల తప్పితే ప్రజల ఇబ్బందులు తెలియవన్నారు. తుపాను బీభత్సంతో శ్రీకాకుళం అతలాకుతలం అయితే పరిసర ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న జగన్ ..బాధితులను పరామర్శించకపోవడం సిగ్గుచేటు అని జేసీ వ్యాఖ్యానించారు.


కులం ఆధారంగా ఓటేయద్దు...
జగన్ కు కులం గజ్జి ఎక్కువని..ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం కులాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు. రెడ్డి అనే కారణంతో జగన్ కు ఓటు వేస్తే భవిష్యత్తు ఉండదన్నారు. ఈ సంద్భంగా జగన్ ఉద్దేశించి మాట్లాడుతూ ' నీ అబ్బ నీ నాన్న పోయి పదేళ్ల అవుతుంది' ఇప్పటి వరకు నువ్వు ప్రజల కోసం ఏం చేశావు అని జగన్ ను ప్రశ్నించారు.  అన్ని వర్గాల వారికి సమానంగా చూస్తూ న్యాయం చేసే ఏకైక నాయకుడు చంద్రబాబు అని.. ఈ సారి ఎన్నికల్లో టీడీపీకే ఓటు వేయాలని ప్రజలను కోరారు జేసీ దివాకర్ రెడ్డి. ఈ సందర్భంగా తిత్లి తుపాను బాధితుల సహాయర్ధం జేసీ రూ.10 లక్షల చెక్కును చంద్రబాబుకు అందించారు.