టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని బుజ్జగించేందుకు అధిష్టానం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. సీఎం చంద్రబాబు భేటీతో ఒక్కసారిగా ఆయన కూల్ అయ్యారు. వివారాల్లోకి వెళ్లినట్లయితే ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి కార్యయంలో సీఎం చంద్రబాబుతో జేసీ భేటీ అయ్యారు.సీఎంతో ఏకాంతంగా చర్చించిన జేసీ వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ సందర్భంగా జేసీ ప్రస్తావించిన అన్ని అంశాలను సావధానంగా విన్న చంద్రబాబు.. రాజీనామా ప్రకటనలపై జేసీకి హితబోధ చేసినట్లు తెలిసింది. రాజీనామా ప్రకటనలు ఇస్తే జనాల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని.. ఇక నుంచి అలాంటి ప్రకటనలు చేయవద్దని హెచ్చరించినట్లు తెలిసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చంద్రబాబుతో భేటీ అనంతరం జేసీ మీడియాతో మాట్లాడుతూ వివాదం సమసిపోయిందని తాను పార్లమెంట్‌కు హాజరవుతున్నానని తెలిపారు. బీజేపీ అధికారంలో ఉన్నంత వరకు ఉన్నంతవరకూ విభజన హామీలు అమలుకావని.. అయితే రాష్ట్ర ప్రయోజనాలతో కోసం తమ పోరాటం కొనసాగించాల్సిందేనని జేసీ వ్యాఖ్యానించారు.


అవిశ్వాసం తీర్మానం సమయంలో తనకంటే జూనియర్ ఎంపీలకు సీఎం చంద్రబాబు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని.. తీర్మానం నోటీసు కేశినేని నానితో ఇప్పించి..ప్రసంగించే అవకాశం తొలి సారి ఎంపీగా ఎన్నికైన గల్లా జయదేవ్ కు ఇచ్చి తనను అవమానించారని భావించిన జేసీ అలక బూనారు. ఈ క్రమంలో ఆయన పార్లమెంట్ సమావేశాలకు వెల్లడం లేదని... పార్టీ విప్ ను లెక్కచేయబోనని ప్రకటించారు. ఇదే క్రమంలో ఆయన టీడీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన టీడీపీ అధిష్టానం అయన్ను బుజ్జగించే ప్రయాత్నాలు మొదలెట్టింది. ఈ క్రమంలో ఆయనకు సీఎం కార్యాలయానికి రావాలని చంద్రబాబు ఆదేశించడం.. ఆయన సీఎం కార్యాయానికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు జరిగిన భేటీతో జేసీ కూల్ అయ్యారు. పార్లమెంట్ సమావేశాలకు వెళ్లేందుకు సముఖత వ్యక్తం చేశారు.