JC Prabhakar Reddy: ఆవేశంలో నోరు జారా... సారీ చెప్తునే మళ్లీ షాకింగ్ కామెంట్స్ చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి..
Jc Prabhaka reddy VS Madhavi latha: తాడి పత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నటి మాధవీలత పై చేసిన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తొంది. ఈక్రమంలో ఆమెకు సారీ చెబుతున్నట్లు ప్రకటించారు.
Jc Prabhakar reddy apology to madhavi latha: తాడిపత్రిలో ఇటీవల న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లు జరిగాయి. అయితే.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఓన్లీఫర్ లేడీస్ అని.. ప్రత్యేకంగా మహిళలకు న్యూఇయర్ నేపథ్యంలో కార్యక్రమం నిర్వహించారు .. దీనిపై బీజేపీ మాధవీలత, యామినిలు మండిపడ్డారు. అక్కడ రాత్రి పూట జరగరానిది జరిగితే.. ఎవరు బాధ్యలని మండిపడ్డారు. అంతే కాకుండా.. మీ ప్రాణా,మానాలకు మీరే బాధ్యులని.. దయచేసి తాడి పత్రి వాళ్లు ఎవరు ఆ ఈవెంట్ కు వెళ్లద్దని అన్నారు. అక్కడి మహిళలు, యువత మాత్రం అదేం పట్టనట్లు వెళ్లిఫుల్ ఎంజాయ్ చేశారు.
మరుసటి రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి దీనిపై మాట్లాడారు. నటి మాధవీలతన ఒక ప్రాస్ట్యూట్ అని అన్నారు. అంతే కాకుండా.. బీజేపీ వాళ్లకు ఆమెను ఎలా పార్టీలో పెట్టుకున్నారని మండిపడ్డారు. దీనిపై మాధవీలత గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. వయసులో పెద్ద మనిషి.. ఇంత నీచంగా మాట్లాడతారా.. అంటూ ఫైర్ అయ్యారు. దీన్ని వదిలేది లేదని.. చావడానికైన సిద్దమని కూడా మాట్లాడారు.
మాధవీలత తాడి పత్రి మహిళలపై చేసిన వ్యాఖ్యలకు కేసునమోదు చేయాలని కూడా కొంతమంది పీఎస్ కు వెళ్లి ఫిర్యాదులు సైతం చేశారు. అయితే..తాజాగా.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ ఘటనపై యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తొంది. జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఘటనపై తాను ఏదో ఆవేశంలో నోరుజారారని చెప్పుకొచ్చారు. మాధవీలతకు సారీ అంటూ చెప్పారు.
అయితే.. కొంతమంది లక్ కలిసి వచ్చి ఏదో పదవులు అనుభవిస్తున్నారని.. వాళ్లంతా ఫ్లెక్సీగాళ్లని అన్నారు. తాను పిలుపునిస్తే.. తాడిపత్రిని డెవ్ లప్ చేసేందుకు అనేక మంది ముందుకొస్తారని అన్నారు. ఈ న్యూఇయర్ వేడుకల్లో వచ్చిన డబ్బుల్ని తాను.. సొంతానికి వాడుకొవట్లేదని.. కేవలం తాడిపత్రి డెవలప్ మెంట్ కు ఉపయోగిస్తానని అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు తనను భారీ మెజార్టీతో గెలిపించారనే విషయంను గుర్తుంచుకొవాలన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.