ఓటుకు నోటు కేసులో అప్రూవర్‌కు 1ప్లస్ 1 భద్రత!
ఓటుకు నోటు కేసులో అప్రూవర్‌కు 1ప్లస్ 1 భద్రత!
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో అప్రూవర్‌గా మారిన జెరుసలేం మత్తయ్యకు తెలంగాణ సర్కార్ 1 ప్లస్ 1 భద్రత కల్పించింది. ఓటుకు నోటు కేసులో అప్రూవర్‌గా మారుతానని ఇటీవలే సుప్రీంకోర్టును ఆశ్రయించిన జెరుసలేం మత్తయ్య.. ఏపీ ప్రభుత్వం నుంచి తనకు ప్రాణహాని ఉన్నందున తనకు భద్రత కల్పించాలని కోర్టును వేడుకున్నారు. జెరుసలేం మత్తయ్య విజ్ఞప్తి మేరకు ఆయనకు తగిన రీతిలో భద్రత కల్పించాల్సిందిగా సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో తెలంగాణ సర్కార్ ఆదేశాల మేరకు తెలంగాణ ఇంటెలిజెన్స్ సెక్యురిటీ వింగ్ ఆయనకు భద్రత కల్పించింది. ఓటుకు నోటు కేసుపై ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.