Jani Master: జానీమాస్టర్ తల్లికి సీరియస్..కొడుకుపై బెంగతో గుండెపోటు
Johnny Master`s mother Bibijan : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొడుకు జైలుకు వెళ్లడంతో బెంగ పెట్టుకున్న బీబీజాన్ కు శనివారం గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు నెల్లూరులోని బొల్లినేని ఆసుపత్రికి తరలించారు.
Johnny Master's mother Bibijan : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లి అస్వస్థతకు గురయ్యారు. తన కుమారుడు జైలుకు వెళ్లడంతో బెంగ పెట్టుకున్న బీబీజాన్ కు శనివారం గుండెపోటు వచ్చింది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు నెల్లూరులోని బొల్లినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్వవేక్షణలో ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న జానీ మాస్టర్ సతీమణి ఆయేష ఆసుపత్రికి వెళ్లారు. తన అత్త ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అయితే బీబీజాన్ ఆరోగ్య పరిస్థితి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
కాగా ప్రస్తుతం జానీ మాస్టర్ ఇష్యూ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిగ్గా ఉన్న సంగతి తెలిసిందే. చాలా మంది సెలబ్రిటీలు మాత్రమే కాదు ప్రేక్షకులు కూడా జానీ మాస్టర్ వివాదం గురించే చర్చించుకుంటున్నారు. అయితే జానీ మాస్టర్ దోషీనా..నిర్దోషినా అనేది ఇంకా తెలియలేదు. అయితే పోలీసులు మాత్రం జానీ మాస్టర్ ను జైలుకు తరలించారు. దీంతో తన కొడుకు పరిస్థితి గురించి తెలుసుకున్న జానీ మాస్టర్ తల్లి బీబీజాన్ మనస్థాపానికి గురయ్యారు.
కొడుకుపై బెంగ పెట్టుకోవడంనే ఆమె గుండె పోటు వచ్చిందని కుటుంబ సభ్యులతోపాటు ఇతరులు కూడా భావిస్తున్నారు. అయితే ఈ విషయం ఇంకా జానీ మాస్టర్ వరకు చేరలేదు. ఒకవేళ తల్లి ఆరోగ్యం గురించి తెలిస్తే జానీ మాస్టర్ ఆసుపత్రికి వస్తారా లేదాఅనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన తల్లి బీబీజాన్ తన కోడలు ఆయేషా దగ్గర ఉండి చూసుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.