Junior NTR: చంద్రబాబుతో భేటీ కానున్న జూనియర్ ఎన్టీఆర్.. మరోసారి రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం..
Jr ntr Ramcharan will meet chandrababu naidu: జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో ఈరోజు భేటీ కానున్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం ఇది రాజకీయాల్లో రచ్చగా మారింది.
Junior ntr and ram charan will meet with ap cm Chandrababu naidu: ఆంధ్ర ప్రదేశ్ లో మరోసారి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఒక వైపు వరదలతో ఏపీలో లోని చాలా ప్రాంతాలు కుదేలయ్యాయి. ఈ క్రమంలో అనేక మంది రాజకీయ నాయకులు, సినిమా రంగంలోని ప్రముఖులు, మిగతా రంగాలకు చెందని వాళ్లు కూడా వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలకు తమ వంతుగా సీఎం రిలీఫ్ ఫండ్ కు సహాయం అందించారు.
ఈ క్రమంలో ఇటీవల జూనియర్ ఎన్టీఆర్.. ఏపీలోని వరదల నేపథ్యలో.. సీఎం రిలీఫ్ ఫండ్ కు 50 లక్షలను ప్రకటించారు. దీనిలో భాగంగానే ఈరోజు అమరావతిలోని సెక్రెటెరియట్ కు చేరుకుని చెక్ అందించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రామ్ చరణ్ కూడా రానున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చంద్రబాబుతో భేటీ కానుండటం మాత్రం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
పూర్తి వివరాలు..
గత కొన్నేళ్లుగా జూనియర్ ఎన్టీఆర్, టీడీపీ పార్టీకి అంటిముట్టనట్లుగా ఉంటున్నారు. ఒకనొక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ మరోపార్టీలోకి వెళ్తున్నట్లు కూడా జోరుగా ప్రచారం జరిగింది.ఈ క్రమంలో.. చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టు అయి యాభైకన్నా.. ఎక్కువ రోజులు జైలులో ఉన్నారు. అంతేకాకుండా.. నారాభువనేశ్వరీ పట్ల.. గత ప్రభుత్వం వైస్సార్సీపీ అవహేళగా మాట్లాడినగా మాట్లాడిన ఘటనలో చంద్రబాబు కన్నీళ్లను సైతం పెట్టుకున్నారు. అయితే.. ఈ ఘటనల్లో జూనియర్ ఎన్టీఆర్ సైలెంట్ గానే ఉన్నారు. కనీసం..దీనిపై ఎలాంటి రెస్సాన్స్ ఇవ్వక పోవడం అప్పట్లో చాలా చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలో జూనియర్ 2009 ఎన్నికల సమయంలో.. చంద్రబాబుకు, పార్టీకి ఫుల్ సపోర్ట్ గా ప్రచారం నిర్వంచారు. కానీ ఆ తర్వాత మాత్రం టీడీపీ మాత్రం.. జూనియర్ ఎన్టీఆర్ ను పూర్తిగా పక్కన పెట్టేసిందని ఆరోపణలు ఉన్నాయి. దీంతో జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారంట. అంతే కాకుండా.. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ ను సైతం..పదవులు ఇస్తామని చంద్రబాబు వాడుకున్నరంటూజోరుగా ప్రచారంలో ఉంది. కానీ ఒకసారి మాత్రం.. ఎంపీగా రాజ్యసభకు టీడీపీ పంపింది. అదే విధంగా.. నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోయినప్పుడు కూడా.. చంద్రబాబు రాజకీయాలు చేశారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి.
బీఆర్ఎస్ కేటీఆర్.. దీనిపై చంద్రబాబు.. నందమూరి హరికృష్ణ భౌతిక కాయం ప్రదేశంలోనే.. పొత్తుల గురించి మాట్లాడరని కూడా కేటీఆర్ అప్పట్లో వ్యాఖ్యలు చేయడం కూడా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు కూకట్ పల్లి నుంచి నందమూరి హరికృష్ణ కూతురు..సుహాసినిని.. గతంలో ఎన్నికల బరిలో నిలిపి కూడా అక్కడ కూడా... సింపతీతో రాజకీయాలు చేశారని కూడా వివాదంఉంది. ఈ క్రమంలో తండ్రికి జరిగిన అన్యాయం, చంద్రబాబు రాజకీయ వ్యూహాలతోనే జూనియర్ ఎన్టీఆర్ పార్టీకీ దూరంగా ఉన్నారంటూ కూడా ప్రచారం జరిగింది.
Read more: Amarapali kata: శివాలెత్తిన ఆమ్రపాలి.. హైడ్రా అధికారులపై సీరియస్.. అసలేం జరిగిందంటే..?
కానీ జూనియర్ ఎన్టీఆర్ తన తాత పెట్టిన పార్టీని వదలి మరోపార్టీలోకి వెళ్లనని కూడా పలు మార్లు క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా, నందమూరి హరికృష్ణ సినిమా రంగంలో యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో జరిగిన కార్యక్రమానికి సైతం.. జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి ఆహ్వానం రాలేదు. దీంతో నందమూరి ఫ్యామీలీ, టీడీపీ పార్టీ రాజకీయాలు తెగ హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల మోక్షజ్ఞ తెరంగేట్రం చేశారు. దీనిపై మాత్రం జూనియర్ రెస్పాండ్ అయ్యారు. మోక్షజ్ఞకు ప్రత్యేకంగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్.. చంద్రబాబుతో భేటీకానుడటం రెండు తెలుగుస్టేట్స్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై చంద్రబాబు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో మాత్రం తెలియాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.