YS Sharmila Assets: తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఆస్తులున్న మహిళ షర్మిల.. ఆమె ఆస్తులెన్నో తెలుసా?
You Know YS Sharmila Assets Value How Many Cases: మొదటిసారి ఎన్నికల్లో నిలబడ్డ షర్మిల నామినేషన్ పత్రంలో తన ఆస్తిపాస్తులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఆస్తులున్న రాజకీయ మహిళగా షర్మిల నిలిచారు.
YS Sharmila Assets: తొలిసారి ప్రజాక్షేత్రంలో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో షర్మిల ఆస్తుల చిట్టా వెలుగులోకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి కుమార్తె.. క్రైస్తవ మత ప్రబోధకుడు భర్తగా ఉన్న షర్మిల ఆస్తులు భారీగా ఉన్నాయి. కడప ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న షర్మిల తాను సమర్పించిన నామినేషన్ పత్రంలో ఆస్తులపై కూడా అఫిడవిట్ సమర్పించారు. ఆమె చెప్పిన లెక్కల ప్రకారం షర్మిల ఆస్తిపాస్తుల విలువ రూ.182.82 కోట్లు.
Also Read: Rahul Gandhi Unwell: ఎండలకు తాళలేక రాహుల్ గాంధీ తీవ్ర అస్వస్థత.. ఆందోళనలో కాంగ్రెస్ శ్రేణులు
ఎన్నికల అధికారికి షర్మిల సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆస్తుల విలువ రూ.182.82 కోట్లు. అయితే వాటిలో తన సోదరుడు, సీఎం జగన్ మోహన్ రెడ్డి వద్ద షర్మిల భారీగా అప్పు తీసుకున్నారు. రూ.82,58,15,000 అప్పును జగన్‌తో తీసుకున్నట్లు షర్మిల తెలిపారు. తన వదిన జగన్ సతీమణి వైఎస్ భారతీ రెడ్డి వద్ద కూడా షర్మిల అప్పు చేశారు. ఆమె వద్ద రూ.19,56,682 అప్పులు షర్మిల చేయడం గమనార్హం.
Also Read: TDP Candidates Change: ఎన్నికల వేళ టీడీపీ భారీ ట్విస్ట్.. రఘురామ కృష్ణంరాజుకు ఛాన్స్
ఏడాదికి షర్మిల సంపాదన రూ.97,14,213 ఉంది. షర్మిల భర్త అనిల్ కుమార్ ఆదాయం మాత్రం కేవలం రూ.3,00,261 మాత్రమే. షర్మిల వెల్లడించిన ఆస్తుల్లో చరాస్తులు రూ.123,26,65,163, భర్త అనిల్ చరాస్తులు రూ.45,19,72,529 ఉన్నాయి. స్థిరాస్తుల విషయానికి వస్తే షర్మిలకు రూ.9,29,58,180, భర్త అనిల్‌కు రూ.4,05,92,365 విలువైన స్థిరాస్తులు మాత్రమే ఉన్నాయి.
అన్నావదిన జగన్ భారతికి చెల్లించాల్సిన అప్పు మొత్తం రూ. 82,77, 71,682. భర్త అనిల్ కుమార్ అప్పులు చూస్తే రూ.35,81,19,299 ఉన్నాయి. షర్మిల వద్ద రూ.3,69,36,000 విలువైన బంగారం, రూ.4,61,90,688 విలువైన వజ్రాభరణాలు ఉన్నాయి. అనిల్ కుమార్‌కు రూ.81 లక్షల విలువైన బంగారం, రూ.42 లక్షల విలువైన వజ్రాభరణాలు ఉన్నాయి. ఇక కేసుల విషయానికి వస్తే షర్మిలపై 8 కేసులు నమోదై ఉన్నాయి. అయితే వాటిలో అత్యధికంగా తెలంగాణలోనే నమోదై ఉండడం గమనార్హం. తెలంగాణ రాజకీయాల్లో సొంత పార్టీ పెట్టి ఉద్యమాలు చేసిన సమయంలో ఆ కేసులు నమోదయ్యాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter