MLC Anantha Babu: డ్రైవర్ ను నేనే కొట్టి చంపా.. అంగీకరించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు
MLC Anantha Babu: ఆంధ్రప్రదేశ్ లో దుమారం రేపుతున్న కారు డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు మిస్టరీ వీడింది. మొదటి నుంచి అందరూ అనుమానించినట్లే వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ అలియాస్ అనంతబాబే దోషిగా తేలింది. పోలీసుల విచారణలో తన కారు మాజీ డ్రైవర్ ను తానే హత్య చేసినట్లు ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించారు.
MLC Anantha Babu: ఆంధ్రప్రదేశ్ లో దుమారం రేపుతున్న కారు డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు మిస్టరీ వీడింది. మొదటి నుంచి అందరూ అనుమానించినట్లే వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ అలియాస్ అనంతబాబే దోషిగా తేలింది. పోలీసుల విచారణలో తన కారు మాజీ డ్రైవర్ ను తానే హత్య చేసినట్లు ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించారు. తాను ఒక్కడినే సుబ్రమణ్యంను కొట్టి చంపానని తెలిపారు. తన వ్యక్తిగత విషయాల్లో తలదూర్చడం వల్లే చంపేశానని ఎమ్మెల్సీ చెప్పినట్లు సమాచారం. అనంతబాబును పోలీసులు ప్రస్తుతం రహస్యంగా విచారిస్తున్నారు. హత్య ఎప్పుడు చేశాడు.. ఎలా చేశోడా రీ కన్ స్ట్రక్షన్ చేశారని తెలుస్తోంది. శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చి సుబ్రమణ్యం తీసుకెళ్లినప్పటి నుంచి.. డెడ్ బాడీని తన కారులో అతని ఇంటికి తీసుకువచ్చే వరకు ఏం జరిగిందో పోలీసులకు వివరించారు ఎమ్మెల్సీ అనంతబాబు.
హత్య చేసినట్లు అంగీకరించడంతో ఎందుకు చేశారనే వివరాలపై కాకినాడ పోలీసులు అనంతబాబును ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. సుబ్రమణ్యం భార్య, తల్లిదండ్రుల ఆరోపణలు, దళితా సంఘాల ఫిర్యాదులపైనా పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. సాయంత్రం ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ ను అధికారికంగా చూపించబోతున్నారు పోలీసులు. జీజీహెచ్ లో వైద్య పరీక్షల అనంతరం కోర్టు ముందు హాజరుపరచనున్నారు.
సుబ్రమణ్యం మృతిని మొదట అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు పోలీసులు. మృతుడి బంధువులు, దళిత సంఘాల ఆందోళనతో హత్య కేసుగా మార్చారు.పోస్ట్ మార్టమ్ నివేదికలోనూ సుబ్రమణ్యానిది హత్యేనని తేలింది. మర్మాంగాలపై తీవ్రంగా కొట్టడంతోనే ఆయన చనిపోయాడని స్పష్టమైంది, సుబ్రహ్మణ్యం ఎడమ చేయి, ఎడమకాలు బొటనవేలు, హెడ్ పై బలమైన గాయాలు ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. డ్రైవర్ మృతి కేసులో అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారని, అతన్ని అరెస్ట్ చేస్తామని జిల్లా ఎస్పీ రవీంద్రబాబు శనివారం ప్రకటించారు. కాని సోమవారం మధ్యాహ్నం వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్సీని పోలీసులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. మూడు రోజులైనా నిందితుడిని పట్టుకోకపోవడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో పోలీసులు ఎమ్మెల్సీ అరెస్ట్ పై ప్రకటన చేశారు. అనంతబాబును కస్టడీకి తీసుకునే ప్రశ్నించే యోచనలో పోలీసులు ఉన్నారని తెలుస్తోంది. తమ పార్టీ ఎమ్మెల్సీ హత్య చేయడంతో వైసీపీలో కలవరం కల్గిస్తోంది. గతంలోనూ హత్య కేసుల్లో ప్రజా ప్రతినిధులు చిక్కుకున్నా... స్వయంగా హత్య చేసిన ఘటనలు చాలా తక్కువగా ఉన్నాయంటున్నారు.
READ ALSO: Hyderabad Honour Killing: నీరజ్ హత్యకు పక్కా స్కెచ్.. రిమాండ్ రిపోర్ట్ లో సంచలన అంశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook