ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా బాధ్యతలు
బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ బాధ్యతలు స్వీకరించారు.
బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ బాధ్యతలు స్వీకరించారు. శనివారం గుంటూరు సిద్ధార్థ గార్డెన్స్‌లో మోదీ ప్రభుత్వ విజయోత్సవ సభలో కన్నా లక్ష్మీనారాయణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు బాధ్యతలను నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కన్నా లక్ష్మీనారాయణకు అప్పగించారు.
ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి సిద్ధార్ధ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎంపీ గోకరాజు గంగరాజు, పార్టీ మహిళా నేత పురందేశ్వరి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేస్తామని, 2019లో ఏపీలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. బీజేపీ, మోదీపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.అధికారం కావాల్సి వచ్చినప్పుడల్లా చంద్రబాబుకు బీజేపీ గుర్తుకువస్తుందన్న కన్నా.. టీడీపీ అసత్య ప్రచారాలను ఎండగడతామని స్పష్టం చేశారు.