Mudragada Padmanabham: ఎన్నికలు దూసుకొస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిపక్షాలన్నీ ఏకమవుతుండగా అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తుండగా అన్ని శక్తులను ఏకం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే కాపు ఓట్లపై కన్నేయడంతో ఆ సామాజిక వర్గంలో బలమైన నాయకుడైన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం త్వరలోనే పార్టీలో చేరుతున్నాడు. ఆయన పార్టీలో చేరితే గోదావరి జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఇక తిరుగులేదని వైసీపీ భావిస్తోంది. ఈ సందర్భంగా పద్మనాభం వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Mizoram Speaker: యాంకర్‌ నుంచి స్పీకర్‌గా.. మిజోరాంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం


కాకినాడ జిల్లాలోని కిర్లంపూడిలో ఉన్న తన నివాసంలో ఆదివారం ముద్రగడ విలేకరుల సమావేశం నిర్వహించారు. 14వ తేదీన నేను, నా కుమారుడు గిరి, నా అనుచరులతో తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. సీఎం జగన్ తరఫున ఎన్నికలలో ప్రచారం నిర్వహిస్తానని తెలిపారు. తాను ఎటువంటి పదవీ కాంక్ష కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. కేవలం పార్టీ తరఫున ప్రచారం చేయడానికి మాత్రమే వెళ్తున్నట్లు వెల్లడించారు. పార్టీ అధికారంలోకి వచ్చాక వచ్చాక వాళ్లు ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తానని పేర్కొన్నారు.

Also Read: Mandapam Collapse: శివ శివా.. మహాశివరాత్రి వేడుకల్లో అపశ్రుతి.. శ్రీశైలంలో కూలిన మండపం


వైసీపీ వ్యూహం
టీడీపీతో పవన్‌ కల్యాణ్‌ జత కలవడంతో కాపు ఓట్లన్నీ కూటమికి పడతాయనే భావనలో వైసీపీ ఉంది. దీనికి విరుగుడుగా కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంతో కొన్నాళ్ల నుంచి అధికార పార్టీ సంప్రదింపులు చేస్తోంది. ఇటీవల కిర్లంపూడిలో వైసీపీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ మిథున్‌ రెడ్డి కలిసి పద్మనాభంతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వైసీపీలో చేరాలని కోరగా.. చర్చించుకుని చెబుతానని తెలిపారు. పద్మనాభం చేరికతో వైసీపీకి కొండంత బలం కానుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు పద్మనాభం చేరిక దోహదం చేయనుంది. ఈ పరిణామంతో పవన్‌కల్యాణ్‌కు కాపు ఓట్లు దూరమయ్యే అవకాశం ఉంది. ఫలితంగా ప్రతిపక్ష కూటమికి కోనసీమ ప్రాంతంలో కొంత ఎదురుదెబ్బ తగిలినట్టయ్యింది.


ముద్రగడ నేపథ్యం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముద్రగడ పద్మనాభం మంత్రిగా పని చేశారు. ఉమ్మడి ఏపీలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి కాకినాడ పార్లమెంట్‌ సభ్యుడిగా పని చేశారు. తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీల్లో పనిచేశారు. ఆయా పార్టీల ప్రభుత్వ కాలంలో మంత్రిగా పని చేశారు. అనంతరం నాలుగేళ్లు బీజేపీలో కొనసాగారు. ప్రస్తుతం ఏ పార్టీలో లేకున్నా కాపు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పద్మనాభం నేతృత్వంలో కాపు సామాజికవర్గం అనేక ఉద్యమాలు చేపట్టింది. తమకు రావాల్సిన హక్కులపై పద్మనాభం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి