Mudragada Padmanabham: చంద్రబాబు, పవన్ ఓటమికి ఎందాకైనా వెళ్తాను
Mudragada Padmanabham: ఏపీలో రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. కాపు ఉద్యమ సారధి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి పవన్ కళ్యాణ్‌పై నిప్పులు చెరిగారు. అమ్ముడుపోయిన వ్యక్తంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mudragada Padmanabham: ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబులపై ఆరోపణలు తీవ్రతరం చేశారు. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకుని విరుచుకుపడ్డారు. ఈసారి విమర్శల స్థాయి పెంచారు. బొచ్చుగాళ్లంటూ తీవ్ర పదజాలమే ఉపయోగించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తోపాటు అతని అన్నయ్య చిరంజీవిపై కూడా వ్యాఖ్యలు చేశాడు. ఒక ఎంపీ, ఎమ్మెల్యే లేని వాడు పార్టీ పెడితే తాను వెళ్లాలా అని ముద్రగడ ప్రశ్నించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారాని విమర్శించారు. డబ్బులకు అమ్ముడుపోయి జనాలకు లక్షలు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. గత ప్రభుత్వం సమయంలో ఐదేళ్లపాటు పవన్ కళ్యాణ్ ఏ మడుగులో ఉన్నారని ఎద్దేవా చేశారు. తన శతృువులతో కలిసి తనకు నీతులు చెప్పడమేంటని ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఓడిపోతాడని జోస్యం చెప్పారు.
ప్రత్తిపాడు నుంచి కాపుల కోసం పనిచేయడంతో తన రాజకీయ పతనం ప్రారంభమైందన్నారు. ఉద్యమ సమయంలో చంద్రబాబు తనను చాలా ఇబ్బందులు పెట్టారన్నారు. సినిమా వాళ్లకు ఎప్పుడూ మీ ఇంటికి వస్తే ఏమిస్తారు..మా ఇంటికొస్తే ఏం తెస్తారనే ధోరణి ఉంటుందన్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పవన్ కళ్యాణ్‌కు చాలా వ్యత్యాసముందన్నారు. కచ్చితంగా 30 ఏళ్లపాటు జగన్ ముఖ్యమంత్రిగా ఉంటారని స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఓటమి కోసం ఎంతదూరమైనా వెళ్తానని ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు.
Also read: AP Inter Results 2024: ఏపీ ఇంటర్ పరీక్షలు 2024 ఫలితాలు ఎప్పుడు విడుదలంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook