ఉత్తరాంధ్ర ఆత్మగౌరవ ఘోషకు కేసీఆర్ మద్దతు
తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా తమ పోరాటానికి మద్దతు తెలిపారని ఉత్తరాంధ్ర చర్చావేదిక సభ్యులు తెలిపారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా తమ పోరాటానికి మద్దతు తెలిపారని ఉత్తరాంధ్ర చర్చావేదిక సభ్యులు తెలిపారు. విశాఖకు రైల్వేజోన్, కడపకు స్టీల్‌ప్లాంట్, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాల్సిందేనని ఎంపీ కొణతాల రామకృష్ణ, సినీ హీరో శివాజి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర చర్చావేదిక ఆధ్వర్యంలో విశాఖపట్నంలో భారీస్థాయిలో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా తమ పోరాటానికి మద్దతు తెలిపడం తమకు సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఈ చర్చావేదిక సభ్యులు తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీని వాయిదా వేసి ఢిల్లీకి రావాలని, ప్రతిపక్ష నేత కూడా పాదయాత్ర ఆపి దేశరాజధానికి వెళ్లి ఆంధ్రప్రదేశ్ సమస్యలను కేంద్రానికి నివేదించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. విశాఖ నుండి ఎంపీగా ఎన్నికైన ఎంపీ కంభంపాటి హరిబాబు బాధ్యతారహితంగా వ్యవహరిస్తు్న్నారని వారు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు సిహెచ్.నరసింగరావు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు పోరాటాన్ని గుర్తుతెచ్చుకొని ఉత్తరాంధ్ర వాసులు పోరాటం చేయాలని తెలిపారు.