టీడీపీ, కాంగ్రెస్ పొత్తుపై స్పందించిన కేఈ
జాతీయ పార్టీ కాంగ్రెస్‌తో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పొత్తుపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.
జాతీయ పార్టీ కాంగ్రెస్‌తో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పొత్తుపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకునే అవకాశాలు ఎంతమాత్రం లేవని స్పష్టం చేశారు. ఒకవేళ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే తాను ఉరేసుకుంటానని ఆయన చెప్పారు. ఇది నా వ్యక్తిగతం కాదు.. పార్టీ తరపునే చెప్తున్నానని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందని, అటువంటి పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటామని ఆయన ప్రశ్నించారు. ప్రజల ఆదరణతోనే రాజకీయంగా ఎదిగినట్లు ఆయన చెప్పారు. నాపై ప్రధాన ప్రతిపక్షం వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని అన్నారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామా ఓ డ్రామా అని.. వైసీపీ, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ వల్లే రాజీనామాలు ఇప్పటివరకు ఆమోదం కాలేదని కేఈ వ్యాఖ్యానించారు.