TDP Mahanadu: ఆంధ్రప్రదేశ్‌లో పసుపు పండుగ కొనసాగుతోంది. ఒంగోలు వేదికగా జరుగుతున్న టీడీపీ మహానాడులో కీలక తీర్మానాలను నేతలు తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు నాలుగు కీలక తీర్మానాలను మహానాడు ముందుకు తీసుకొచ్చారు. సంక్షేమ పథకాల పేరుతో మోసం, కార్యకర్తలపై ప్రభుత్వ వేధింపులు, బాదుడే బాదుడు, వ్యవసాయం అంశాలపై ప్రవేశ పెట్టిన తీర్మానాలకు పచ్చజెండా ఊపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కష్టాల కడలిలో సేద్యంపై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా ప్రభుత్వంపై తీరుపై మండిపడ్డారు. వైసీపీ పాలనలో రైతాంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైయ్యిందన్నారు. 45 లక్షల ఎకరాల్లో పంట సాగు అయితే కేవలం 15 లక్షల ఎకరాలకే ఆర్థిక సాయం అందించారని చెప్పారు. మోటార్లకు మీటర్లు ఉంచడాన్ని అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తుంటే..వైసీపీ ప్రభుత్వం అంగీకరించడం ఏంటని ప్రశ్నించారు. 


టీడీపీ హయాంలో రైతుల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చామని గుర్తు చేశారు. రాయలసీమ రైతులను జగన్ సర్కార్ పట్టించుకోవడం లేదని ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. ప్రభుత్వం హామీ ఇచ్చినా రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ ఏయ్యిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని వైసీపీ ఎంపీయే చెప్పారని..ఐనా సీఎం జగన్‌లో చలనం లేదని ఫైర్ అయ్యారు. గతప్రభుత్వంలోనే రైతులకు న్యాయం జరిగిందన్నారు. 


అమరావతి, పోలవరం ప్రాజెక్టులపై మహానాడులో తీర్మానం ప్రవేశపెట్టారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ..తీర్మానాన్ని చదివి వినిపించారు. అమరావతిపై జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. అమరావతిపై కుల ముద్ర వేయడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా దళితులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ను వైసీపీ సర్కార్ నాశనం చేసిందని మండిపడ్డారు. కీలక ప్రాజెక్ట్‌లు పూర్తి అయితేనే రాష్ట్రం ముందుకు పోతుందన్నారు.


Also read:MLA Jaggareddy: స్టాలిన్‌ దమ్మున్నోడు, సీఎం అంటే అలానే ఉండాలి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు..!


Also read:Aryan Khan Case: క్రూజ్ నౌక డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు..ఆర్యన్‌కు అందుకే ఊరట లభించిందా..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook