Ys Jagan-Ponguleti: సీఎం జగన్‌తో పొంగులేటి సమావేశం వెనుక కారణాలేంటి
Ys Jagan-Ponguleti: ఓ వైపు తెలంగాణ ఎన్నికలు మరోవైపు ఏపీలో వేడెక్కుతున్న రాజకీయాలు. ఈ క్రమంలో ఇటీవల కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న ఆ నేత హఠాత్తుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు మీ కోసం.
Ys Jagan-Ponguleti: తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రోజురోజుకూ మారుతున్న రాజకీయ సమీకరణాల నేపధ్యంలో ఏపీ, తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. రాజకీయాలు హాట్ హాట్‌గా ఉన్న తరుణంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలవడం ఆసక్తి రేపుతోంది.
తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసులురెడ్డి తాజాగా కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఖమ్మంలో తలపెట్టిన భారీ బహిరంగసభలో రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాసులురెడ్డి ఎంపీగా గెలిచారు. అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపధ్యంలో బీఆర్ఎస్‌లో చేరినా వైఎస్ జగన్‌తో మాత్రం సత్సంబంధాలు కొనసాగించారు. ఇటీవ బీఆర్ఎస్ పార్టీ నుంచి వైదొలగి కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు మరో మాజీ కాంగ్రెస్ నేత జూపల్లి కృష్ణారావు సైతం కాంగ్రెస్ పార్టీకు తిరిగొచ్చారు. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించి ఇప్పటికే విస్తృతంగా పాదయాత్ర చేపట్టారు.
అటు కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో రావడం, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను వైఎస్ షర్మిల కలిసి అభినందించడం మరో పరిణామం. దీనికితోడు డీకే శివకుమార్‌కు పార్టీ అధిష్టానం తెలంగాణ బాధ్యతలు అప్పగించిన తరువాతే పొంగులేటి, జూపల్లిలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ పరిణామాలన్నీ రాజకీయంగా హీటెక్కిస్తున్న తరుణంలో పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలవడం కొత్త చర్చకు దారి తీస్తోంది.
వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానే వార్తలు ఇటీవలి కాలంలో అధికమయ్యాయి. దీనిపై కాంగ్రెస్ నేతలు స్పందించడమే తప్ప వైఎస్ షర్మిల నోరెత్తలేదు. అలాగని ఖండించలేదు. ఇవాళ పొంగులేటి జగన్‌ను కలవడం వెనుక షర్మిల పార్టీ విలీన అంశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే వైఎస్ కుటుంబసభ్యులతో పొంగులేటికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
Also read: Supreme Court Collegium: తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు.. ఎవరంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook