టీడీపీకి చెందిన యువ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఆరు నెలలు పూర్తి కానున్నాయి. అయితే దీంతో ఏంటి సంబంధం అనుకుంటున్నారా అయితే వివరాల్లోకి వెళ్లండి మీరే అర్థమౌతంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిబంధనల ప్రకారం ప్రత్యక్షంగా ప్రజా ప్రతినిధి కాని వ్యక్తి మంత్రి పదవి చేపట్టిన నేపథ్యంలో మంత్రి పదవి చేపట్టిన ఆరు నెలల్లోపు చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. ఈ లోపు ఎమ్మెల్యేగా కానీ ..ఎమ్మల్సీగా కానీ బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. లేని పక్షంలో మంత్రి పదవికి ఆ వ్యక్తి అనర్హులవుతారు అవుతారు. 


సరిగ్గా ఆరు నెలల క్రితం రాష్ట్ర వైద్య, ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖా మంత్రిగా కిడారి శ్రవణ్ బాధ్యతలు చేపట్టిని విషయం తెలిసిందే.  చంద్రబాబు కేబినెట్ లో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మే 10కి ఆరు నెలలు పూర్తవుతుంది. సార్వత్రిక ఎన్నికలు సమీపించడంతో అరకు అసెంబ్లీ స్థానానికి ప్రత్యేకంగా ఉప ఎన్నిక నిర్వహించలేదు. దీంతో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం శ్రవణ్ కుమార్‌కు రాలేదు. ఎమ్మెల్సీగా కూడా నామినేట్ అవ్వకపోవడంతో ఇప్పుడు కిడారి శ్రవణ్ మంత్రి పదవి కోల్పోవడం అనివార్యమైంది.


మరి కొన్ని రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పటు చేయాల్సి ఉన్న తరుణంలో ఈ వ్యవహారానికి అంతగా ప్రాధాన్యత లేకపోయినప్పటికీ నిబంధనల ప్రకారం ఆయన మంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంది. అయితే గవర్నర్ కార్యాలయం నుంచి తనకు ఎటువంటి సమాచారం అందలేదంటున్నారు కిడారీ శ్రవణ్ కుమార్