విజయవాడ: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తనకు బద్దశత్రువుగా భావించే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై ప్రస్తుత సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లుకురిపించారు. కిరణ్ కుమార్ గురించి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో కిరణ్ చిత్తశుద్ధితో వ్యవహరించారని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన ఒక పద్దతి లేకుండా జరుగుతున్న సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి పోరాటపటిమ ప్రదర్శించారని చంద్రబాబు కితాబిచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో బుధవారం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన సభలో ఏపీ సీఎం చంద్రబాబు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు..శాశ్వత మిత్రులు ఉండబోరని చంద్రబాబు వ్యాఖ్యలతో మరోసారి రుజువైంది. తాజా పరిణామాలు.. బద్ధ శత్రువులుగా భావించే సీఎం చంద్రబాబు, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కటౌతున్నారానే ఊహాగానాలకు మరింత బలం చేకూర్చుతున్నాయి. ప్రస్తుతం ఈ అంశం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.