Godavari River Floods areas peoples fighting for Food packets: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు, నదులు పొంగిపొర్లిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో వరద బీభత్సం సృష్టించింది. భారీ వరదలకు లంక గ్రామాలు మొత్తం అతలాకుతలం అయ్యాయి. ప్రస్తుతం గోదావరి నదిలో నీరు తగ్గడంతో పలు గ్రామాల్లో వరద 2 అడుగులు మేర తగ్గింది.అయినా కూడా అనేక ప్రాంతాల్లో వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారీ వరదల కారణంగా రాజోలు, మామిడికుదురు, సఖినేటిపల్లి, గన్నవరం, అయినవిల్లి మండలాల్లోని పలు గ్రామాల్లోని ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఎంతలా అంటే ఆహార పొట్లాల కోసం కోట్లాటకు దిగారు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. పెదపట్నం లంక గ్రామంలో వరద బాధితులకు గత 5-6 రోజులుగా కనీసం మంచి నీరు కూడా అందలేదు. A1 సేవా సమితి అధ్యక్షుడు చెల్లి బోయిన శ్రీనివాసు సంస్థలు వరద బాధితుల కోసం ఆహారం పొట్లాలు పట్టుకుని వెళ్లారు. తమకే కావాలంటూ ఆహార పొట్లాల కోసం బాధితులు కొట్టుకున్నారు. 


ఆహారపు పొట్లాల కోసం కొట్లాడుతున్న బాధితులను ఫైర్ సిబ్బంది, అధికారులు విడదీశారు. ఆపై అందరికీ ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. అయితే ఆహారపు పొట్లాల కోసం కొట్టుకున్న దృశ్యాలు అందరి మనసులను కలిచివేస్తున్నాయి. గత వారం రోజులగా వరద ముంపులోనే పీకలోతు నీటిలో ఆకలితో అలమటిస్తున్నామని లంక గ్రామాల్లోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తమను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కనీసం భోజనం, తాగునీరు అయినా అందించాలని వారు కోరుతున్నారు. 


Also Read: Srinu Vaitla: ఆ హీరోయిన్ వల్లే విడాకుల దాకా శ్రీను వైట్ల వ్యవహారం?


Also Read: Chiranjeevi: చిరంజీవిపై సీపీఐ నారాయణ అనుచిత వ్యాఖ్యలు... చిల్లర బేరగాడంటూ!


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook