Konda Surekha Against YS Jagan: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి రాజకీయంగా ప్రతిపక్షాల కన్నా సొంత మనుషుల నుంచే ఎదురుదాడి ఎక్కువైంది. ఇప్పటిదాకా ఇద్దరు చెల్లెలు అతడికి వ్యతిరేకంగా పని చేయడం మొదలుపెట్టగా.. తాజాగా వారికి తోడుగా మరొకరు చేరుతున్నారు. ఉమ్మడి ఏపీలో జగన్‌కు తెలంగాణలో మొదటి నుంచి అండగా నిలిచిన కొండా సురేఖ ఇప్పుడు ఏపీలో ప్రత్యర్థిగా మారనున్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారం చేస్తానని సురేఖ ప్రకటించి సంచలనం సృష్టించారు. జగన్‌ పాలనకు వ్యతిరేకంగా పని చేస్తానని ప్రకటించి కలకలం రేపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ ఉద్యమం తీవ్రరూపంలో ఉన్న సమయంలో కూడా తెలంగాణ నాయకురాలిగా ఉన్న కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీ జగన్‌కు వెన్నంటే ఉన్నారు. అతడి కోసం సురేఖ తన మంత్రి పదవిని కూడా త్యాగం చేసి కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకు వచ్చారు. సమైక్యాంధ్రకు మద్దతునిచ్చినా కూడా జగన్‌ వెంటే సురేఖ నిలిచారు. మహబూబాబాద్‌లో ఓదార్పు యాత్రకు జగన్‌ రావడంతో తెలంగాణ అగ్గి మీద గుగ్గిలమైంది. 28 మే 2010 మహబాబూబాద్‌ ఒక రణరంగాన్ని తలపించింది. ఆరోజు తీవ్ర ఘర్షణకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆరోజు రైల్వే స్టేషన్‌ మొత్తం బీభత్సంగా మారింది. రాళ్ల దాడి.. తుపాకీ కాల్పులకు దారి తీసింది. ఆ సమయంలో జగన్‌ను కాపాడింది కూడా సురేఖ దంపతులే.


ఆ తర్వాత వేగంగా రాజకీయాలు, తెలుగు రాష్ట్రాల్లో చాలా మార్పులు వచ్చాయి. రాష్ట్ర విభజనతో ఏపీకి జగన్‌ పరిమితమవడంతో సురేఖ దంపతులు ఇతర పార్టీలు చేరారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి కొన్ని సంవత్సరాలు ఉన్న వారు తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఇప్పుడు అనూహ్యంగా సురేఖ తెలంగాణ మంత్రి అయ్యారు. అయితే గతంలో ఆమె మద్దతునిచ్చి వెన్నుదన్నుగా నిలిచిన జగన్‌ సోదరి షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరింది. వైఎస్‌ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న కొండా దంపతులు ఇప్పుడు షర్మిలకు మద్దతు తెలుపుతున్నారు.


ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమితురాలైన షర్మిలకు అండగా నిలబడాలని సురేఖ నిర్ణయించారు. గతంలో తాను అభిమానించిన జగన్‌కు వ్యతిరేకంగా పని చేయాలని సురేఖ భావిస్తున్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ప్రకటన రాగానే అక్కడ పర్యటిస్తానని ఆమె తెలిపారు. షర్మిలకు అండగా నిలబడడంతోపాటు కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలిగా ఏపీలో ప్రచారం చేయడానికి వెళ్తానని సురేఖ వెల్లడించారు. ఇప్పటికే ఇద్దరు చెల్లెళ్లు షర్మిల, సునీతారెడ్డిలు జగన్‌పై ఎదురుదాడి చేస్తుండగా ఇప్పుడు సురేఖ రాకతో ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా సాగనున్నాయి. వారిద్దరికి సురేఖ తోడయితే జగన్ చరిష్మాకు కొంత ప్రభావం వాటిల్లే అవకాశం ఉంది. ఇద్దరు చెల్లెళ్లు, ఇప్పుడు తెలంగాణ అక్కతో జగన్‌ ఎలా ఎదుర్కుంటాడో వేచి చూడాలి.

Also Read: Kumari Aunty: స్ట్రీట్‌ ఫుడ్‌ కుమారి ఆంటీపై కేసు.. ఆందోళనలో ఆమె అభిమానులు

Also Read: Telangana High Court: తెలంగాణలో అనూహ్య మలుపు.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారానికి బ్రేక్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి