Anandaiah Corona medicine: ఆనందయ్య చుక్కల మందులో హానికారక పదార్థం, రిపోర్టులో ఆశ్చర్యకర విషయాలు
Anandaiah Eye Drops Latest Update: ఇదివరకే ఆనందయ్య తయారు చేసే మందుకు అనుమతి రావడంతో పంపిణీ కొనసాగుతోంది. చుక్కుల మందుపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. రిపోర్టులలో తేలిన విషయాలను ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది హైకోర్టుకు వెల్లడించారు.
Anandaiah Corona medicine: కరోనా బాధితుల కోసం నెల్లూరు జిల్లా ఆనందయ్య తయారుచేస్తున్న ఔషధంపై మరోసారి ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇదివరకే ఆనందయ్య తయారు చేసే మందుకు అనుమతి రావడంతో పంపిణీ కొనసాగుతోంది. చుక్కుల మందుపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు ఆనందయ్య ఔషధం కోసం ఇతర రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా చుక్కల మందుపై ఏపీ హైకోర్టులో విచారణ చేపట్టారు. 5 ల్యాబులలో చుక్కల మందు (Anandaiah Medicine) పరీక్షించగా ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. కంటికి హాని కలిగించే పదార్థం ఆనందయ్య చుక్కల మందులో ఉన్నట్లుగా ల్యాబులు గుర్తించాయని ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది హైకోర్టుకు వెల్లడించారు. ల్యాబులలో చుక్కల మందుపై చేసిన పరీక్షలకు సంబంధించిన నివేదికలు తమకు సమర్పించాలని ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్టు సూచించింది. చుక్కల మందుపై తదుపరి విచారణ జూలై 1కి వాయిదా వేశారు.
Also Read: India Corona Updates: కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం, 88 రోజుల కనిష్టానికి కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook