సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా టి.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. 16 ఎంపీలతో ఏం చేస్తారని తమను ప్రతిపక్షాల ప్రశ్నిస్తున్నాయి...ఇద్దరు ఎంపీలతో తెలంగాణ సాధించుకున్నాం..16 మందితో మన హక్కులను సాధించుకోలేమా అంటూ ప్రశ్నించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతిపక్షాల చెబుతున్నట్లు తమకు 16 మంది బలమే కాదు.. ఏపీలో జగన్ మద్దతు ఉంది..యూపీలో బీఎస్పీ,ఎస్పీ పార్టీలు ఉన్నాయి..ఒడిశాలో నవీన్ పట్నాయన్ ఉన్నారు.. ఎన్నికల తర్వాత అందరం కలుస్తాం.. అప్పుడు తమ బలం 120 నుంచి 150 మందికి చేరుతుంది. ఈ బలంతో మేం ఢిల్లీ రాజకీయాలను  శాసిస్తామని కేటీఆర్ అన్నారు. 


ఉదయం  వైఎస్ షర్మిల ఓ మీడియా  సమావేశంలో కేటీఆర్ పేరును ప్రస్తావించిన విషయం తెలిసిందే. నారా లోకేష్ తో కేటీఆర్ ను పోల్చుతూ ప్రసంశల జల్లు కురిపించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ నోట మళ్లీ జగన్ మద్దతు ప్రస్తావన రాడం గమనార్హం. ఇప్పటికే జగన్ గెలిస్తే ఏపీ కేసీఆర్ సామంత రాజ్యంగా మారుతుందని ప్రజలకు అప్రమత్తం చేస్తున్నారు. తాజా పరిణామంపై టీడీపీ నేతలు మరింత రెచ్చిపోయే అవకాశముంది.