ఆంధ్రా కశ్మీర్ లంబసింగికి పెరిగిన పర్యాటకుల రద్దీ
విశాఖ ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావంతో రోజుకింత చలి తీవ్రత పెరుగుతోంది. విశాఖ మన్యాన్ని మంచు దుప్పటి కప్పేస్తుండటంతో ఇక్కడ నమోదవుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు.
చింతపల్లి: విశాఖ ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావంతో రోజుకింత చలి తీవ్రత పెరుగుతోంది. విశాఖ మన్యాన్ని మంచు దుప్పటి కప్పేస్తుండటంతో ఇక్కడ నమోదవుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. శనివారం చింతపల్లిలో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. వారం రోజుల కిందట అత్యల్పంగా 7 డిగ్రీలు నమోదు కాగా, ఆ తర్వాత ఉష్ణోగ్రతలు కాస్త క్రమంగా పెరుగుతూ వచ్చాయి. కానీ శనివారం మళ్లీ ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
ఇదే చింతపల్లి మండలంలో ఉన్న లంబసింగి వద్ద మంచు అందాలను వీక్షించేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఆంధ్రా కశ్మీర్‌గా పేరున్న లంబసింగికి ప్రతీ ఏడాది చలికాలంలో పర్యాటకుల రద్దీ పెరిగే సంగతి తెలిసిందే.