Helicopter Crash: చిట్టితల్లిని చూడాలనుంది..వీడియా కాల్ చేస్తా అంటూ కూతుర్ని చూసుకున్నాడు. ముద్దాడాడు. వీలైతే సాయంత్రం చేస్తానన్నాడు. వీలు కుదరలేదు..అనంతలోకాలకు పయనమయ్యాడు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమిళనాడులో ఘోర ప్రమాదానికి గురైన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు(IAF)చెందిన హెలీకాప్టర్ ఎంఐ 17 వి 5లో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌తో పాటు మరో 12 మంది మరణించారు. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లాన్స్ నాయక్ సాయితేజ్ కూడా మరణించాడు. చిత్తూరు జిల్లా కురబాలకోటకు చెందిన ఎగువరేడ గ్రామం సాయితేజది. బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. 2013లో ఆర్మీలో చేరిన సాయితేజ్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ ఏడాది వినాయకచవితికి చివరిసారిగా స్వగ్రామానికి వెళ్లాడు. 


ప్రమాదంలో చనిపోవడానికి కొద్దిగంటల ముందే భార్య పిల్లలతో ఫోన్‌లో మాట్లాడిన మాటలిప్పుడు అందర్నీ కలచివేస్తున్నాయి. ఉదయం 8 గంటల 45 నిమిషాలకు ఫోన్‌లో మాట్లాడిన సాయితేజ్(Lance Naik Saitej)..మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు ప్రమాదంలో చనిపోయాడు. మరణానికి 4 గంటల ముందు మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుని కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. 


చిట్టి తల్లిని చూడాలనుంది..వీడియో కాల్ చేస్తాను. బాబు మోక్షజ్ఞ స్కూల్‌కు వెళ్లాడా..అని చెప్పి వీడియో కాల్ చేశాడు. భార్యతో మాట్లాడి..కూతురుకు ముద్దులిచ్చాడు. బిపిన్ రావత్‌తో(Bipin Rawat)కలిసి తమిళనాడు వెళ్తున్నానని..వీలైతే సాయంత్రం చేస్తానని భార్యకు చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఇవే చివరి మాటలు. ఇక వీలు కుదరలేదు. భగవంతుడి దగ్గరకే వెళ్లిపోయాడు. ఇదే తలచుకుని ఆ కుటుంబం..గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. 


Also read: Bipin Rawat Escaped: ఆరేళ్లక్రితం మృత్యువుని జయించిన బిపిన్...ఈసారి మాత్రం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook