LAXMI PARVATHI REACTION:  ఎన్టీఆర్ తో తన పెళ్లిపై మాట్లాడే అర్హత ఎవరికి లేదన్నారు లక్ష్మి పార్వతి. ఎన్టీఆర్ కు ద్రోహం చేసిన వాళ్లే ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ఎన్టీఆర్ తో తన వివాహం తిరుపతిలో జరిగిందని చెప్పారు. అందరి సమక్షంలోనే ఈ మ్యారేజీ జరిగిందన్నారు. చరిత్రను ఎవరూ చెరిపివేయలేరన్నారు లక్ష్మిపార్వతి. ఎన్టీఆర్ తో తన వివాహం చంద్రబాబుకు మొదటి నుంచి ఇష్టం లేదన్నారు. తనకు టెక్కలి అసెంబ్లీ సీటు ఆఫర్ చేసినా తాను తిరస్కరించానని తెలిపారు. తనకు పదవి కావాలని ఎప్పుడు ఎన్టీఆర్ ను అడగలేదన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అప్పుడు ఏం జరిగిందో ఇప్పటి తరం తెలుసుకోవాల్సి ఉందన్నారు. కొన్ని మీడియా సంస్థలు దారుణంగా వ్యవహరిస్తున్నాయని.. తనపై అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నాయని లక్ష్మిపార్వతి ఆరోపించారు. తనపై పని గట్టుకుని వార్తలు రాస్తూ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని లక్ష్మిపార్వతి మండిపడ్డారు. ఎల్లో మీడియా ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని కించపరుస్తోందని ఆరోపించారు. అధికార దాహంతోనే చంద్రబాబు అలా ప్రచారం చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. అందరికి వాస్తవాలు చెప్పడానికే ప్రెస్ మీట్ పెట్టానన్నారు. తాను ఎలాంటి స్వార్ధం లేకుండానే ఎన్టీఆర్ కు సేవ చేశానని తెలిపారు. చంద్రబాబు దుర్మార్గానికి కుటుంబ సభ్యులు వంత పాడారన్నారు. ఏ రోజు పార్టీ విషయాల్లో తాను జోక్యం చేసుకోలేదన్నారు లక్ష్మిపార్వతి. చంద్రబాబు టీమ్ చేస్తున్న విష ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలను అభ్యర్థించారు.


అల్లుళ్ల వర్గ పోరు వల్లే 1989లో ఓడిపోయామని ఎన్టీఆర్‌ చెప్పారని లక్ష్మిపార్వతి గుర్తు చేశారు. తాను ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించాక టీడీపీ ఘనవిజయం సాధించిందని చెప్పారు. గతంలో ఎన్టీఆర్‌ మాట్లాడిన వీడియోని ఆమె ప్రదర్శించారు. తనకు అధికార దాహం ఉంటే అప్పుడు చంద్రబాబుకు రెండు పదవులు వచ్చేవా అని ప్రశ్నించారు. చంద్రబాబు నమ్మించి గొంతుకోస్తాడని ఎన్టీఆర్‌ తనతో చాలాసార్లు చెప్పారన్నారు. ఎన్టీఆర్‌కు ద్రోహం చేయబోనని చంద్రబాబు తన కొడుకుపై ప్రమాణం చేశారని లక్ష్మిపార్వతి చెప్పారు. ఎన్టీఆర్ దూరం పెడుతున్నారని తన దగ్గరకు వచ్చి చంద్రబాబు ఏడ్చారని.. తాను ఎన్టీఆర్ తో మాట్లాడి కూల్ చేశారని చెప్పారు. అప్పుడే పాముకు పాలుపోస్తున్నావని చంద్రబాబు గురించి తనతో ఎన్టీఆర్‌ ఆన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు లక్ష్మిపార్వతి.


రామోజీరావు, చంద్రబాబు, రాధాకృష్ణ కలిసే ఎన్టీఆర పై కుట్ర చేశారని లక్ష్మిపార్వతి ఆరోపించారు. ఎన్టీఆర్‌ ప్రధాని అవుతారన్న భయంతోనే అలా కుట్ర చేశారన్నారు. ఎన్టీఆర్‌ను చంపిన హంతకులు గురించి అందరికీ తెలియాలనే తాను మీడియా ముందుకు వచ్చానన్నారు.  అధికారంలో ఉన్న ఏరోజైనా ఏ పథకానికైనా ఎన్టీఆర్‌ పేరు పెట్టావా చంద్రబాబూ అంటూ నిలదీశారు.


Also read:Viral Video: పాఠశాలలో విద్యార్థుల పాడు పని..ఫైర్ అవుతున్న నెటిజన్లు..!


Also read:IND vs AUS: ఉప్పల్ స్టేడియంలో టీమిండియా ఎన్ని విజయాలు సాధించిందో తెలుసా..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook